Breaking News

నేడు ‘హజ్‌ యాత్ర’ ప్రారంభం

Published on Mon, 05/27/2024 - 06:24

సాక్షి, అమరావతి/గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌ నుంచి హజ్‌–2024 యాత్ర సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 2,580 మంది హాజీల పవిత్ర యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఉదయం 8 : 45 గంటలకు విజయవాడ ఎంబార్గేషన్‌ పాయింట్‌ (గన్నవరం విమానాశ్రయం) నుంచి తొలి విమానం బయలు దేరనుంది. మొదటి విమానంలో ప్రయాణించే 322 మంది హజ్‌ క్యాంపు నుంచి ఉదయం 4 గంటలకే గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

వారి సౌకర్యం కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఈద్గా జామా మసీదు వద్ద మదర్సాలోని హజ్‌ వసతి క్యాంపులో ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి హజ్‌ క్యాంపు వద్దకు చేరుకున్న తొలి బృందానికి వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివ­రించారు. 24 గంటలు పనిచేసేలా మదర్సా వద్ద మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటైంది. వ్యాక్సినేషన్, వైద్య సహాయం అందించేలా అధికారులు చర్యలు చేప­ట్టారు. మదర్సా వద్ద పరిశుభ్రమైన వాతావరణంలో టెంట్లు, ఎయిర్‌ కూలర్లు సిద్ధం చేసి నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. మహిళా పోలీసులను కూడా నియమించారు.

మదర్సా (హజ్‌ క్యాంపు) నుంచి హాజీలను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ ఏసీ బస్సు సౌకర్యం కలి్పంచింది. అధికారులు, సిబ్బంది సమన్వయంతో హజ్‌ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీ కార్యనిర్వహణ అధికారి (సీఈవో) ఎల్‌.అబ్దుల్‌ ఖాదర్‌ ‘సాక్షి’కి తెలిపారు.  

వరుసగా రెండో ఏడాది 
హజ్‌ యాత్ర కోసం ఈ ఏడాది కోటా కింద 2,902 మందికి కేంద్ర హజ్‌ కమిటీ అనుమతి ఇవ్వగా రాష్ట్రం నుంచి 2,580 మంది నమోదు చేసుకున్నారు. విజయవాడ నుంచి ఎంబార్గేషన్‌ పాయింట్‌కు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అనుమతి సాధించింది. దీంతో వరుసగా రెండో ఏడాది విజయవాడ ఎంబార్గేషన్‌ పాయింట్‌ నుంచి హాజ్‌ యాత్ర ప్రారంభం కానుంది.

విజయవాడ నుంచి 728 మంది ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడు విమానాల్లో ప్రయాణమవుతున్నారు. హైదరాబాద్‌ నుంచి 1,118 మంది, బెంగళూరు నుంచి 725 మంది, చెన్నై ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి 9 మంది బయలుదేరనున్నారు. మక్కా, మదీనాలో యాత్రి­కుల కోసం ప్రతి 200 మందికి ఒక ఖాదీమ్‌–ఉల్‌–హుజ్జాజ్‌(స్వచ్చంద సేవకులు)ను నియమించారు.  

ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌.. 
హజ్‌ యాత్రికులు జూలై 1 నుంచి 21వతేదీ లోపు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటారు. ఒక్కో హాజీకి సుమారు 40 రోజుల పర్యటనకు మాత్రమే అనుమతి ఉంటుంది. హ్యాండ్‌ బ్యాగేజి కింద 8 కిలోలు, చెక్‌ ఇన్‌ లగేజీ కింద 20 కేజీల బరువున్న రెండు బ్యాగులను అనుమతిస్తారు. విజయవాడ హజ్‌ క్యాంపు వద్ద ఎస్‌బీఐ తాత్కాలిక కేంద్రంలో ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు ఫారిన్‌ ఎక్సే్చంజీ అందిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో గన్నవరం వద్ద ఒక్కొక్కరికి ఐదు లీటర్ల జామ్‌ జామ్‌ వాటర్‌ (పవిత్ర జలం) క్యాన్లను అందిస్తారు. యాత్రకు సంబంధించి అదనపు సమాచారం కోసం 1800 4257873 ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌లో సంప్రదించవచ్చు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)