Breaking News

పీడీఎస్‌ కాదు.. ‘మనోహర‘మైన బియ్యం..!

Published on Sun, 01/05/2025 - 05:35

సాక్షి, విశాఖపట్నం: మంత్రి పట్టుకున్న­ప్పుడు రేషన్‌ బియ్యం నెల రోజుల్లోనే సాధారణ బియ్యంగా మారిపోవడం కూటమి నేతలు చేసిన మ్యాజిక్కే. మంత్రి అనుచరుల మంత్రాంగమే. చేతులు తడిపితే చాలు.. పేదోడి బియ్యం కూడా ‘మనోహర’మైన బియ్యంగా మారిపోతు­న్నాయి. రేషన్‌ బియ్యమే అయినా.. దర్జాగా షిప్‌ ఎక్కి దేశాలు దాటిపోతు­న్నా­యి.    పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గత నెల 9న విశాఖపట్నం కంటైనర్‌ టెర్మినల్‌కు వచ్చి  పో­ర్టు కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్లలో తనిఖీలంటూ హడా­వుడి చేశారు. 

బియ్యాన్ని నాలుగైదుసార్లు రెండు చేతు­ల్లో అటు ఇటూ తిప్పి.. ఇవి 100 శాతం పీడీఎస్‌ బియ్యం.. సీజ్‌ ది రైస్‌.. అంటూ ఆదేశాలు జారీ చేసి, అక్కడ ఉన్న రెండు సంస్థలకు చెందిన 483 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాకినా­డ నుంచి బిబో ఇంటర్నేషనల్‌ సంస్థ  తెచ్చిన 8 లారీ­ల లోడు (259 టన్నులు) మొత్తం రేషన్‌ బియ్యమే అని మంత్రి, అధికారులు, ప్రత్యేక బృందాలు ప్రక­టించారు. 48 గంటల్లో సమగ్ర డాక్యుమెంట్లు తేకపో­తే బియ్యా­న్ని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. 

48 గంటలు గడిచినా ఏ చర్యా లేదు. ఇంతలో మంత్రి అనుచరులు రంగప్రవేశం చేసి, సీను మొత్తాన్ని మార్చేసినట్లు చెబుతు­న్నారు. మొత్తం బియ్యం వ్యాపారాన్ని నిలిపి­వేయి­స్తామని ఆ ఎక్స్‌­పోర్టు సంస్థని బెదిరించినట్లు సమా­చారం. దీంతో ఆ సంస్థ వారు అడిగిన మొత్తా­నికి ఒప్పందం కుదుర్చు­కున్న తర్వాత ఆ బియ్యం రేషన్‌ బియ్యం కాదని క్లీన్‌చిట్‌ ఇచ్చేస్తున్నారని కొందరు అధికారులే చెబుతు­న్నారు. 

మంత్రి అనుచరులు ఉన్న­తాధికారులపై తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఆ బియ్యా­నికి క్లీన్‌ చిట్‌ ఇచ్చి, ఎగుమతికి ప్రొసీడింగ్స్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ బియ్యాన్ని రేపో మాపో నౌకలో చైనా పంపేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపో­తున్నాయి. మరో సంస్థ మాత్రం ఇంకా బేరం కుదు­ర్చు­కోకపోవడంతో మిగతా బియ్యం అలాగే ఉండిపోయింది.

విశాఖ కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌ (సీఎఫ్‌ఎస్‌) 
నుంచి ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 టన్నుల రేషన్‌ బియ్యాన్ని గుర్తించి సీజ్‌ చేశాం. కాకినాడ పోర్టులో నిఘా పెరగడం వల్ల వైజాగ్‌ పోర్టు నుంచి స్మగ్లింగ్‌ చేస్తున్నారు. అందుకే తనిఖీ చేసి పట్టుకున్నాం. వారిపై కేసులు కూడా పెడుతున్నాం. ఇకపై ఒక్క గింజ పీడీఎస్‌ బియ్యం కూడా పోర్టు దాటి వెళ్లకుండా పేదలకు చేర్చడమే మా లక్ష్యం.   
– డిసెంబర్‌ 9న పౌర సరఫరాల శాఖ  మంత్రి నాదెండ్ల మనోహర్‌ చేసిన ప్రకటన

కట్‌ చేస్తే..: పోర్టులో మంత్రి నాదెండ్ల సమక్షంలో పట్టుకున్న 483 టన్నుల బియ్యంలో 259 టన్నులు రేషన్‌ బియ్యం కాదు. ఆ 8 లారీల్లో బిబో సంస్థ తెచ్చిన బియ్యాన్ని నిరభ్యంతరంగా ఎగుమతి చేసుకోవచ్చు.– ఈ నెల 2న జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ జారీ చేసిన సర్క్యులర్‌ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)