Breaking News

ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు

Published on Tue, 05/21/2024 - 04:27

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్‌ అకౌంట్స్‌ తెలిపాయి. 2023–24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ప్రాథమిక అకౌంట్స్‌ను కాగ్‌ వెల్లడించింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.23,589 కోట్లు మూల ధన వ్యయం చేసినట్లు పేర్కొంది. మూల ధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా కాగ్‌ పరిగణిస్తుంది. అలాగే, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం బడ్జెట్‌ కేటాయింపులకు మించి అయినట్లు కాగ్‌ గణాంకాలు తెలిపాయి.

2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఉద్యోగుల వేతనాల కోసం రూ.50,882 కోట్లు కేటాయించగా రూ.52,010 కోట్లు వ్యయం అయ్యాయని, పెన్షన్‌ కోసం బడ్జెట్‌లో రూ.21,183 కోట్లు కేటాయించగా రూ.21,694 కోట్లు వ్యయం అయ్యా­యని పేర్కొంది. సామాజిక రంగం వ్యయంలో (విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమాలకు) రూ.1,10,375 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. సాధారణ సేవలకు రూ.67,281 కోట్లు, ఆర్థిక సేవలకు రూ.57,344 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది. 2023–24 ఆర్థిక ఏడాది మొత్తం బడ్జెట్‌ కేటాయింపుల్లో 91.97% వ్యయం చేసినట్లు తెలిపింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు రూ.–37,468 కోట్లు ఉండగా ద్రవ్య లోటు రూ.–61,765 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది,

గత ఐదేళ్ల బడ్జెట్‌లో మూల ధన వ్యయం ఇలా..

ఆర్థిక ఏడాది    మూల ధన వ్యయం   (రూ.కోట్లలో) 
2019–20              17,601 
2020–21              20,690 
2021–22             18,511 
2022–23             7,581 
2023–24            23,589 
మొత్తం             రూ. 87,972 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)