Breaking News

కొబ్బరి.. దయచూపాలి మరి

Published on Wed, 08/28/2024 - 05:20

సాక్షి, అమలాపురం: ప్రపంచంలోనే లాంగెస్ట్‌ అండ్‌ టాలెస్ట్‌ క్రాప్‌గా గుర్తింపు పొందిన కొబ్బరి సాగులో రైతులు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి రైతులు, రైతు సంఘాల నాయకులు చేస్తున్న సూచనలను కేంద్రానికి, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు నివేదిస్తామని జాతీయ కొబ్బరి సదస్సులో వక్తలు తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలోని జనహిత భవనంలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ (బీకేఎస్‌) ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరిగే అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. 

ఈ సందర్భంగా భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆలిండియా కోకోనట్‌ కన్వినర్‌ సుందరరాజన్‌ అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల కొబ్బరి రైతుల సమస్యలు, పరిష్కార సూచనలపై చర్చాగోíÙ్ఠ జరిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొబ్బరి సాగు, యాజమాన్య పద్ధతులు, కొబ్బరికాయ సేకరణ, రవాణా, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌ అవకాశాల్లో ఎదురవుతున్న సమస్యలను, వాటికి పరిష్కారాలను సూచించారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), కాయర్‌ బోర్డు, పరిశ్రమల సంస్థలు, ఏజెన్సీల సహాయ నిరాకరణపై సుదీర్ఘ చర్చ జరిగింది. సమావేశానంతరం పలు తీర్మానాలు రూపొందించారు. వీటిని బుధవారం అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రిలో జరిగే రెండోరోజు సదస్సులో మరోసారి చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించనున్నట్లు బీకేఎస్‌ ప్రతినిధులు తెలిపారు.

తీర్మానాలు ఇలా..
» ఎండు కొబ్బరితోపాటు కొబ్బరి బోడకాయ (వలిచిన కాయ)ను కిలో రూ.45 ధర నిర్ణయించి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలి.. 
»     ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌)ల ద్వారా కూడా కొబ్బరి కొనుగోలు చేయాలనే ప్రధాన  తీర్మానాలతోపాటు దింపు యంత్రాలను రాయితీలపై అందించాలి.. 
»  రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓ)ల ఏర్పాటుకు సహకారం, మార్కెటింగ్‌ సౌకర్యాలు పెంచాలి.. 
»  వాతావరణ, దిగుబడి ఆధారిత బీమా సౌకర్యం, అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను తక్కువ ధరకు అందించాలి.. 
» కొబ్బరి చెట్టును ఔషధ గుణమైన చెట్టుగా గుర్తించాలి.. 
»  కొబ్బరిని పరిశ్రమగా  గుర్తించడంతోపాటు రాయితీల కల్పన,  పాతచెట్ల తొలగింపు పథకం ఆర్‌అండ్‌ఆర్‌కు  అందించే ప్రోత్సాహాన్ని చెట్టుకు రూ.వెయ్యి  నుంచి రూ.2,500కు  పెంచారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)