Breaking News

‘అప్పు’డే పరగడుపు

Published on Fri, 08/08/2025 - 05:47

సాక్షి, అమరావతి: బడ్జెట్‌ బయట ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ సమావే­శం అలా ఆమోదం తెలిపిందో లేదో.. అందుకు సంబంధించి గురువారం వెనువెంటనే వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయిపోయాయి. బడ్జెట్‌ బయట ఏపీఐఐసీ, డిస్కమ్స్‌ ద్వారా ఏకంగా రూ.12,973. 94 కోట్ల అప్పునకు ఇంధన శాఖ, పరిశ్రమల శాఖ వేర్వే­రుగా ఉత్తర్వులు జారీ చేశాయి. ఇందులో ఏపీఐఐసీ ద్వారా రూ.7,500 కోట్ల అప్పును వచ్చే 12 నెల ల్లోగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

ఇందుకోసం ప్రత్యేకంగా స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వేదికగా కోటి రూపాయలు అదీకృత షేర్‌ కేపిటల్, రూ. లక్ష పెయిడ్‌–అప్‌ షేర్‌ కేపిటలతో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేశారు. ఎస్‌పీవీ బోర్డు అవసరాల ఆధా రంగా ఎప్పటికప్పుడు అధీకృత పెయిడ్‌–అప్‌ కేపి టల్, షేర్‌ కేపిటల్‌ను పెంచవచ్చునని తెలిపారు.  

ప్రస్తుతం ఏపీఐఐసీ దగ్గర ఉన్న భూములను ఎస్‌పీవీకి బదిలీ చేస్తారు. ఆ బదిలీ చేసిన భూములను బ్యాంకులు, ఆర్థిక సంస్దలకు తనఖా పెట్టి 9–12 నెలల కాలవ్యధిలోనే రూ.7,500 కోట్లు రుణాన్ని సమీకరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీఐఐసీ దగ్గర 13,000 ఎకరాలకుపైగా భూములున్నాయని, కొత్తగా మరో 30 వేల ఎకరాలను సేకరించడంతోపాటు ఆ భూములను పరిశ్రమల అవసరాలకు అభివృద్ధి చేసేందుకు రూ.7,500 కోట్లు అప్పు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.  

విద్యుత్‌ డిస్కమ్స్‌ ద్వారా ఇలా.. 
ఇదిలా ఉంటే ప్రస్తుతం స్మార్ట్‌ మీటరింగ్‌తోపాటు రేవ్యాంప్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టర్‌ స్కీమును అమలు కొనసాగింపునకు ఏపీఎస్‌పీడీసీఎల్‌ ద్వారా రూ.3544.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌ ద్వారా రూ.1029.37 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభు­త్వం గ్యారెంటీ ఇస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరో పక్క ఇప్పటికే ఏపీపీడీసీఎల్‌ ఎస్‌బీఐ, యుబిఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణా­లు చెల్లించేందుకు ఆ సంస్థ ఖాతాల్లో నిధుల్లేక దివా­ళా తీసింది. 

ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ, యూబీఐ బ్యాంకులు ఆర్‌బీఐకి, సిబిల్, క్రిసిల్‌ సంస్థలకు రిపో­ర్ట్‌ చేస్తామని హెచ్చరించాయి. ఏపీపీడీసీఎల్‌ ఆరి్థక పరిస్థితి దిగజారడంతో చెల్లింపులు ఆలస్యం అవుతు­న్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆ బ్యాంకులు దగ్గర ఏపీపీడీసీఎల్‌ తీసుకున్న రూ.900 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)