Breaking News

ప్రైవేటుకు ‘హరితా’ర్పణం

Published on Mon, 05/26/2025 - 05:24

సాక్షి, విశాఖపట్నం: సంపద సృష్టి అంటూ.. ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్‌ చేతుల్లో పెట్టేస్తోంది కూటమి సర్కారు. పర్యాటక శాఖకు ఆదాయం తెచ్చి పెట్టే ఆస్తులేవైనా ఉన్నాయంటే అవి కేవలం హరిత హోటళ్లు మా­త్రమే. రాష్ట్రంలో ఏపీటీడీసీకి ప్రతి జిల్లాలోనూ హరిత హోటళ్లు ఉన్నాయి. వీటిల్లో 30 హోటళ్లను ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేసి టూరిజం శాఖను నిర్వీర్యం చేసే దిశగా కుట్రలు పన్నుతోంది.  

విజయవాడలో సమావేశం  
హరిత హోటళ్లను ప్రైవేటు పరంచే సేందుకు  ఈ నెల 23న కొంత మంది స్టేక్‌ హోల్డర్లకు ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానమందించింది. విజయవాడ బెరంపార్క్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఎవరెవరు వస్తారో ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా సమాచారం ఇవ్వాలంటూ ఆదేశించింది. ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న వారినే ఈ సమావేశానికి అనుమతిచ్చింది. 

సమావేశంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ హరిత హోటళ్ల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఏయే హోటల్‌కు ఎంత ఆదాయం వస్తుంటుంది.. ఎక్కడెక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి.. మొదలైన అంశాల గురించి ఏపీటీడీసీ అధికారులు స్టేక్‌ హోల్డర్లకు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పేరుతో హరిత హోటళ్లను ప్రైవేట్‌ పరం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు

ప్రధాన పర్యాటక ప్రాంతాలూ ప్రైవేటుకేనా? 
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత హోటళ్లని తొలి విడతలో ప్రైవేట్‌కు అప్పగించే పని వేగవంతం చేస్తున్న సర్కారు తర్వాత టూరిజంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను కూడా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించేందుకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం.  ఇప్పటికే ఏయే ప్రాంతాల్ని ప్రైవేట్‌ సంస్థల చేతుల్లో పెట్టాలనే దానిపై ఇప్పటికే నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లా నుంచి ప్రధాన పర్యాటక ప్రాంతాలు.. వాటి ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన నివేదికలను ప్రభు­త్వం ఉన్నపళంగా అడిగి తెప్పించుకుంది. 

వీటిలో ఎంపిక చేసిన వాటిని నెల రోజుల వ్యవధిలోనే ప్రైవేట్‌కు అప్పగించాలంటూ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఇలా ఆదాయాన్ని తెచ్చే హరిత హోటళ్లు, పర్యాటక ప్రాంతాల్ని మొత్తం ప్రైవేట్‌ పరం చేసేస్తే.. ఏపీటీడీసీ, ఏపీ టూరిజం అథారిటీకి ఆదాయం ఎలా వస్తుందంటూ జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి నివేదిస్తున్నా పట్టించుకోవడం లేదని సమాచారం. 

వీలైనంత త్వరగా.. తాము చెప్పిన సంస్థలకు పర్యాటక ఆస్తుల్ని కట్టబెట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయితే.. టూరిజం శాఖకు రాష్ట్రంలో ఒక్క హోటల్‌ కూడా లేకుండా పోతుంది. ఇన్నాళ్లూ తక్కువ ఖర్చుతో పర్యాటక ప్రాంతాలను సందర్శించిన ప్రజలపైనా భారం భారీగానే పడనుంది.  

ఉపాధికి గండి 
పర్యాటక శాఖకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలోనూ హరిత హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. ఒక్కో ప్రాజెక్టులో 50 నుంచి 60 మంది వరకూ ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది కాంట్రాక్టు ఉద్యోగులు కాగా, 40 శాతం అవుట్‌ సోర్సింగ్, 10 శాతం మంది రెగ్యులర్‌ ఉద్యోగులుంటారు. ఒక వేళ 30 హోటళ్లని ప్రైవేట్‌కు కట్టబెడితే.. దాదాపు 1000 మందికిపైగా ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలిసి కూడా కేవలం కాసులకు ఆశపడి.. ఉపాధిపొందుతున్న వారి కడుపు కొట్టేందుకు కూటమి ప్రభుత్వం వెనకాడటం లేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)