లేని కరెంటుతోనూ షాక్‌!

Published on Sat, 01/11/2025 - 04:59

కరెంటు బిల్లులు బాగా పెరిగాయని బాధ పడకండి. మీ ఇంటినే ఓ గ్రిడ్‌గా మార్చుకునే అపురూప అవకాశం కల్పిస్తున్నాం. మీకు సరిపడా కరెంటును వాడుకుని, మిగిలిన కరెంటును మీరు అమ్ముకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ ఇంటిపై రూఫ్‌ టాప్‌ సోలార్‌ సిస్టం పెట్టుకోవడమే. – ఇటీవల సీఎం చంద్రబాబు  

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే వరుసగా విద్యుత్‌ చార్జీలు పెంచేస్తూ రాష్ట్ర ప్రజలపై భారం వేస్తోంది. ఇప్పటికే రూ.15,485 కోట్లు వసూలు చేయడం ప్రారంభించింది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్‌ పథకంలో వచ్చే ప్రోత్సాహకాలను దక్కించుకోవడం కోసం విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డిస్కంలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. 

ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో అధికారులు, సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించాయి. దీంతో వినియోగదారులతో బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించేస్తున్నారు. కానీ అలా రిజి్రస్టేషన్‌ చేసుకున్న వారికి ఈ నెల జారీ అయిన బిల్లులు చూసి గుండె ఆగినంత పనైంది. ప్రతి నెలా సాధారణంగా రూ.200 నుంచి రూ.500 వరకు వచ్చే బిల్లు రూ.5 వేలు, రూ.6 వేలు రావడంతో లబోదిబోమంటూ బాధితులు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. 

ఇప్పటికే దాదాపు 250 మందికి పైగా వినియోగదారులు తమకు బిల్లులు అధికంగా వచ్చాయని అధికారులకు ఫిర్యాదు చేశారు.  కాగా, పీఎం సూర్యఘర్‌ పథకంలో రిజి్రస్టేషన్‌ చేయించుకున్న వారికి విద్యుత్‌ బిల్లులు భారీగా వచ్చినట్లు ఏపీఈపీడీసీఎల్‌ ఫైనాన్స్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ జీవీ అరుణకుమారి దృష్టికి అకౌంట్స్‌ విభాగం అధికారులు తీసుకెళ్లారు. 

కార్పొరేట్‌ కార్యాలయం నుంచి శుక్రవారం అన్ని సర్కిళ్ల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన జీఎం.. తొలుత ఆ బిల్లులన్నింటినీ సిస్టమ్‌ నుంచి తొలగించాలని చెప్పినట్లు సమాచారం. అలాగే బిల్లులు అధికంగా వ­చి్చన విషయం మీడియా దృష్టికి వెళ్లకుండా జాగ్ర­త్త పడాలని హెచ్చరించినట్లు కూడా తెలిసింది. దీనిపై జీఎంను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అరుణకుమారి ఫోన్‌లో స్పందించ లేదు.  

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)