Breaking News

ప్రైవేట్‌ చేతుల్లోకి ఫైబర్‌నెట్‌

Published on Sun, 09/21/2025 - 05:51

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఎంతో సమర్థవంతంగా పనిచేసిన ఏపీ ఫైబర్‌నెట్‌ను.. 15 నెలల పాలనలో క్రమంగా బలహీనపరుస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు దానిని ‘ప్రైవేటు’కు అప్పజెప్పబోతోంది. ఇప్పటికే అమలవుతున్న భారత్‌ నెట్‌–1తో పాటు భారత్‌నెట్‌–2 ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థలు బిడ్లు దాఖలు చేయాలని ఏపీ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) తాజాగా టెండర్లు పిలిచింది. 

విశాఖ, చిత్తూరు జిల్లా్లల్లో భారత్‌నెట్‌–1 నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేసి ఫేజ్‌–2కు ఇంటిగ్రేషన్‌ చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఫేజ్‌–2 వ్యవస్థను ఏర్పాటు చేయడం, గ్రామాల్లో విస్తరణ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీ ఫైబర్‌నెట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించింది. 

సాంకేతిక సిబ్బందికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం, సేవలను నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఫైబర్‌ నెట్‌ కనెక్షన్ల సంఖ్య సగానికి సగం పడిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కేబుల్‌ ఆపరేటర్లు అనేకసార్లు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేశారు. అలాగే జీవీ రెడ్డి కూడా ఏపీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఇలా.. కుట్రపూరితంగా ఫైబర్‌నెట్‌ను నిర్వీర్యం చేస్తూ వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేటు ఏజెన్సీకి  కట్టబెడుతోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)