Breaking News

మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం

Published on Fri, 05/17/2024 - 05:04

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల  పోలింగ్‌ సరళి, ఫలితాల అంచనాపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా స్పందించారు. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని, మళ్లీ అధికారంలోకి రాబోతు­న్నా­మని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం పొలిటికల్‌ కన్సల్టెన్సీగా పని చేసిన ఐ–ప్యాక్‌ (ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ) కార్యాలయాన్ని సీఎం జగన్‌ గురువారం సందర్శించారు. 

విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ సమీపంలో ఉన్న ఐ – ప్యాక్‌ కార్యాలయానికి వచ్చిన ఆయన సుమారు అరగంట సేపు గడిపారు. ఐ–ప్యాక్‌ ప్రతినిధులను అభినందించి సెల్ఫీలు దిగుతూ  సరదాగా గడిపారు. 2019 ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకుని వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం సాధించిందని ఈ సందర్భంగా సీఎం జగన్‌ గుర్తు చేశారు. ఈ దఫా అంతకంటే ఎక్కువ స్థానాల్లో విజయ పతాకం ఎగురవేసి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు.

మరింత మంచి చేద్దాం..
ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ 4న వచ్చే ఫలితాలు చూసి దేశం షాక్‌ అవుతుందని.. ఫలితాలు వెల్లడైన తర్వాత దేశం మొత్తం మన వైపు చూస్తుందని సీఎం జగన్‌ చెప్పారు. 59 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజలకు మంచి చేశామని.. రాబోయే ఐదేళ్లలో ఇంకా ఎక్కువ మేలు చేద్దామని చెప్పారు. రానున్న రోజుల్లో ఐ–ప్యాక్‌తో ప్రయాణం ఇలాగే కొనసాగుతుందన్నారు.

విశ్వసనీయతే విజయానికి మెట్టు..
గత ఎన్నికల్లో చారిత్రక విజయంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ తొలి ఏడాదే మేనిఫెస్టోలోని హామీల్లో 95 శాతం అమలు చేశారు. మొత్తమ్మీద 99 శాతం హామీలను అమలు చేశారు. అర్హతే ప్రామాణికంగా వివక్ష, లంచాలకు తావు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించారు. సంక్షేమ పథకాల ద్వారా 59 నెలల్లో పేదల ఖాతాల్లోకి డీబీటీ రూపంలో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. 

నాన్‌ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు. చెప్పిన ప్రతి హామీని అమలు చేసిన సీఎం జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరిగింది. వైఎస్సార్‌సీపీ మరో చారిత్రక విజయానికి ఇదే బాటలు వేసిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మహిళలు, గ్రామీణులు వైఎస్సార్‌సీపీ వైపే..
అమ్మ ఒడి, ఆసరా, చేయూత లాంటి పథకాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు సీఎం జగన్‌ సుస్థిర బాటలు వేశారు. కేబినెట్‌ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశారు. నామినేటెడ్‌ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మరీ మహిళలకు పట్టం కట్టారు. ఇంటి స్థలంతోపాటు ఇంటిని కూడా మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చారు. మహిళా సాధికారతకు బాటలు వేసిన సీఎం జగన్‌ నాయకత్వంపై మహిళల్లో మద్దతు మరింత పెరిగింది.

 గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటి గుమ్మం వద్దే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. ఊరు దాటాల్సిన అవసరం లేకుండా పనులన్నీ జరుగుతుండటంతో సీఎం జగన్‌ నాయకత్వంపై గ్రామీణుల నమ్మకం మరింత పెరిగింది.ఇటు ప్రభుత్వం.. అటు ప్రైవేట్‌ రంగాల్లో భారీ ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడంతో సీఎం జగన్‌ నాయకత్వంపై యువతలో విశ్వసనీయత రెట్టింపైంది. 

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, గ్రామీణులే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మహిళలు, గ్రామీణులు పెద్ద ఎత్తున సీఎం జగన్‌ నాయకత్వానికి మద్దతుగా ఓటు వేయడం వల్లే పోలింగ్‌ శాతం పెరిగిందని, వైఎస్సార్‌సీపీ మరోసారి చారిత్రక విజయం సాధించడం ఖాయమని తేల్చి చెబుతున్నారు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)