Breaking News

మనసున్న సీఎం వైఎస్‌ జగన్‌

Published on Sat, 12/30/2023 - 05:32

సాక్షి, భీమవరం: ఆపన్నులను ఆదుకోవడంలో ముందుండే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం పర్యటనలోనూ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. శుక్రవారం నాటి భీమవరం పర్యటనలో అనారోగ్యంతో, ఇతరత్రా ఇబ్బందులతో బాధ పడుతున్న వారి గోడు విని అప్పటికప్పుడే సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

అత్తిలి మండలం తిరుపతిపురానికి చెందిన గుడాల అపర్ణ జ్యోతి, దెందులూరు మండలం శ్రీరామవరంనకు చెందిన కంతేటి దుర్గాభవాని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న భీమడోలు మండలం పూళ్లకు చెందిన అరుగుల లాజర్‌ తనయుడు, అదే గ్రామానికి చెందిన నూతుల మార్తమ్మ, యలమంచిలి మండలం దొడ్డిపట్లకు చెందిన చిల్లి సుమతి తనయునికి వైద్య సాయం నిమిత్తం ఆర్థిక సాయం, భర్త మృతి చెందిన నరసాపురం 29వ వార్డుకు చెందిన ఎల్లమల్లి అన్నపూర్ణ, ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌కు చెందిన తేతలి గీతలకు పరిహారంగా ఆర్థిక సాయం అందజేశారు.

నరసాపురం మండలం ఎల్‌బీ చర్లకు చెందిన కడలి నాగలక్ష్మికి భూపరిష్కారం నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ పి.ప్రశాంతి, జేసీ ఎస్‌.రామసుందర్‌రెడ్డిలు తొమ్మిది మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)