Breaking News

వరల్డ్‌ టూరిజంలో ఏపీకి ప్రత్యేక స్థానం రావాలి: సీఎం జగన్‌

Published on Fri, 08/18/2023 - 10:56

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించారు. గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్‌ ప్లేస్‌ హోటల్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. హయత్‌ ప్లేస్‌ హోటల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంశాఖమంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కే రోజా, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్,  హోటల్‌ హయత్‌ ప్లేస్‌ ఛైర్మన్‌ ఆర్ వీరా స్వామి, ఉన్నతాధికారులు, పలువులు ఇతర ప్రజా ప్రతినిధులు.పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  సీఎం జగన్‌ ఏమన్నారంటే...
►
హయత్‌ ఛైర్మన్‌ వీరస్వామి, హయత్‌ ఇంటర్నేషనల్‌ ఏరియా ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌, మేనేజింగ్ డైరెక్టర్‌ సాయికార్తీక్‌లతో పాటె ఈ ప్రాజెక్టులో మమేకమైన అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు సీఎం జగన్‌

►విజయవాడలోనే కాకుండా ఆంధ్రరాష్ట్రమంతా ఇలాంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్‌, ప్రముఖ హోటల్స్‌ వచ్చి... ఆంధ్రరాష్ట్రం కూడా గ్లోబల్‌ ఫ్లాట్‌ఫాంమీద,  ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో ఒక ప్రత్యేకమైన స్ధానం పొందాలని... మంచి టూరిజం పాలసీని తీసుకువచ్చాం. మంచి టూరిజం పాలసీని తీసుకునిరావడమే కాకుండా.. మంచి చైన్‌ హోటల్స్‌ను కూడా ప్రోత్సహిస్తూ వచ్చాం. 

►ఒబెరాయ్‌తో మొదలుకుని ఇవాళ ప్రారంభం చేసుకుంటున్న హయత్‌ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్లకు సంబంధించిన సంస్ధలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం.

►ఈ కార్యక్రమం ఇంకా మరో నలుగురికి స్ఫూర్తినివ్వాలని, మరో నలుగురు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వారందరికీ ఇలాంటి ప్రోత్సహకాలిచ్చి ఏపీని వరల్డ్‌ టూరిజం మ్యాప్‌లో పెట్టేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించడానికి ప్రభుత్వం  సిద్ధంగా ఉంది. 

►విజయవాడ నగరంలో మంచి ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ హోటల్స్‌ ఇంకా రావాలని, ఇవి రాష్ట్ర మంతటా విస్తరించాలని మనసారా కోరుకుంటున్నాను. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)