Breaking News

భావితరాలు ప్రపంచాన్ని ఏలే స్థాయికి.. అమ్మ ఒడిపై సీఎం జగన్ ట్వీట్

Published on Wed, 06/28/2023 - 15:31

సాక్షి, తాడేపల్లి: మన భావితరాలు ప్రపంచాన్ని ఏలే  స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేనన్ని సంక్షేమ పథకాలను విద్యారంగంలో మన ప్రభుత్వంలో ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వరుసగా నాలుగో ఏడాదీ ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు కార్యక్రమానికి సీఎం బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ‘అమ్మ ఒడి’ పథకంపై ఆయన ట్వీట్ చేశారు.

‘‘పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ బిడ్డల విద్యావసరాల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చాం. ఈ పథకం కింద తమ పిల్లలను చదివిస్తున్న 42.64 లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేడు రూ.6,393 కోట్లను జమ చేస్తున్నాం. ఈ ఒక్క పథకం కిందే మన ప్రభుత్వం ఈ నాలుగేళ్ళలో రూ.26,067 కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. విద్యార్థులందరినీ ఉన్నత విద్యావంతులు చేసే లక్ష్యంతో విద్యారంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.
చదవండి: చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం: సీఎం జగన్‌

తాజాగా విడుదలైన నిధులతో కలిపి.. ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని జగనన్న ప్రభుత్వం లబ్ధిదారులకు చేకూర్చినట్లయ్యింది. ఇక గత నాలుగేళ్లలో నాలుగేళ్లలో విద్యా రంగంపై సీఎం జగన్‌ ప్రభుత్వం రూ.66,722.36 కోట్లను వెచ్చించారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)