రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్
Breaking News
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
తిరుపతి మేయర్ అభ్యర్థిపై కుట్రలు
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్ రూల్స్ ఇవే..
ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!
‘టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు మా పనే’.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
కరోనాపై అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి: సీఎం జగన్
Published on Mon, 04/10/2023 - 16:50
తాడేపల్లి: వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈరోజు(సోమవారం) విద్యాశాఖపై సమీక్ష అనంతరం వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ ప్రధానంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి విడదల రజిని, సీఎస్ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ఏమన్నారంటే..
- కరోనా వ్యాపిస్తుందన్న సూచనలు నేపధ్యంలో అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశం
- గ్రామ స్ధాయిలోనే పరీక్షలు నిర్వహించి, అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కోవిడ్ సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలుండాలన్న సీఎం
- కోవిడ్ తాజా పరిస్థితి, నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు
- పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని తెలిపిన అధికారులు
- పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు
- విలేజ్ క్లినిక్స్ స్ధాయిలోనే ర్యాపిడ్ టెస్టులు చేసే వ్యవస్థ ఉందని, అక్కడ ఏమైనా తేలితే వెంటనే ఆర్టీపీసీఆర్‌కు పంపించే ఏర్పాటు చేశామన్న అధికారులు
- రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేయించామని కేవలం 25 మంది మాత్రమే కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరారని వెల్లడించిన అధికారులు
- ఆక్సిజన్ లైన్లు, పీఎస్‌ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ సిలెండర్లు, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు వీటన్నింటినీ కూడా చెక్ చేసి సిద్ధంచేసుకుంటున్నామన్న అధికారులు
- అంతర్జాతీయ విమాన ప్రయాణికులనుంచి ర్యాపిడ్ శాంపిల్స్ తీసుకునేందుకు విమానాశ్రయాల్లో అన్నిరకాలుగా సిద్ధంచేశామన్న అధికారులు
ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...
- ముందు జాగ్రత చర్యల్లో భాగంగా అన్నిరకాలుగా సిద్ధం కావాలన్న సీఎం.
- ఎప్పటికప్పుడు పరిస్థితిని చూసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
- ఫ్యామిలీ డాక్టర్, విలేజీ క్లినిక్స్ వ్యవస్ధ కోవిడ్ విస్తృతిని అడ్డుకోవడానికి, మంచి వైద్యం అందించేలా చేయడానికి ఉపయోగపడుతుందన్న సీఎం
- గ్రామాల్లో సర్వే చేసి, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి, వారికి వెంటనే మందులు ఇచ్చేలా చూడాలన్న సీఎం
- ప్రతి విలేజ్ క్లినిక్‌కూ టెస్టింగ్ కిట్స్, మందులు పంపించాలని సీఎం ఆదేశం
- ప్రస్తుతం ఉన్న వేరియంట్‌కు తగినట్టుగా మందులు తెప్పించుకోవాలన్న సీఎం
- ల్యాబులను అన్నింటినీ కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసుకోవాలన్న సీఎం
జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపైనా సీఎం జగన్ సమీక్ష
- మొదటి ప్రాధాన్యతలో నిర్దేశించుకున్న విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల్లో షెడ్యూలు ప్రకారం పనులు జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు.
- మిగిలిన కాలేజీల్లో కూడా పనులను ముందుకు తీసుకెళ్తున్నామన్న అధికారులు.
- పూర్తయ్యే దశలో పలాస కిడ్నీ స్పెషాల్టీ హాస్పిటల్, కర్నూలులో కేన్సర్ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ కడపలో జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ, కేన్సర్ విభాగంతో సహా మూడు బ్లాకులు.
- కొన్నిరోజుల్లో ఇవి పూర్తిగా సిద్ధమవుతాయని తెలిపిన అధికారులు.
#
Tags : 1