Breaking News

రేపు ఈ–ఆటోలను ప్రారంభించనున్న సీఎం

Published on Wed, 06/07/2023 - 07:15

సాక్షి,నెహ్రూనగర్‌(గుంటూరు)/భవానీపురం(విజయ­వాడ పశ్చిమ): క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ చెత్త సేకరణ కోసం కేటాయించిన ఈ–ఆటోలను ఈ నెల 8న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 9 గంటలకు మొత్తం 516 ఈ–ఆటోలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీడీఎంఏ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ, ఇతర అధికారులను పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి మంగళవారం ఆదేశించారు.

కాగా గుంటూరు నగరపా­లక సంస్థకు గతంలో 220 ఈ–ఆటోలు కేటాయించిన సంగతి తెలిసిందే. వీటిని ప్రభుత్వం రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. పూర్తి స్థాయిలో గురువారం నుంచి ఈ–ఆటోలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఇంటింటా చెత్త సేకరణ వేగంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే శ్రమ, ఇంధనం ఖర్చు కూడా తగ్గుతుందని అంటు­న్నారు. అంతేకాకుండా క్లీన్‌న్‌గుంటూరు, క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కల సాకారమవుతుందని పేర్కొంటు­న్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య కార్మికులకు ఇప్పటికే ఈ–ఆటో డ్రైవింగ్‌లో అధికారులు శిక్షణ కూడా ఇచ్చారు.

చదవండి: ఏడాదిలోనే జీతాల వ్యయం..  రూ.8,068కోట్లు పెరుగుదల

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)