Breaking News

నేడు జగనన్న వసతి దీవెన

Published on Wed, 04/26/2023 - 04:16

సాక్షి, అమరావతి: చెప్పిన మాట మేరకు సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జగనన్న వసతి దీవెన అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని అనంతపురం జిల్లా నార్పల వేదికగా కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేయను­న్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది.

గత ప్రభుత్వంలో అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయడమేగాక 2017 నుంచి పెండింగ్‌ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా జగన్‌ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు.

వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. 

విప్లవాత్మక సంస్కరణలు
కరిక్యులమ్‌లో మార్పులు, నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కోర్సులు, తప్ప­ని­సరిగా ఇంటర్న్‌షిప్‌ తదితర విప్లవా­త్మక కార్యక్రమాలతో విద్యా రంగాన్ని బలో­పేతం చేస్తోంది. డిజిటల్‌ విద్యలో భాగంగా 8 వ తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌లు, నాడు–నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్‌రూమ్‌లో 30,213 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లలో స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేసింది.

అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు వెచ్చించింది. కాగా, బుధవారం ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలు­దేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. అనంతరం నార్పల క్రాస్‌రోడ్స్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న వసతి దీవెన కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. తిరిగి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు