Breaking News

ఈ మమకారం ఎప్పటికీ తీరదు: వైఎస్‌ జగన్‌

Published on Tue, 03/12/2024 - 05:51

సాక్షి ప్రతినిధి, కడప: అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శనీయమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత గడ్డపై సగర్వంగా ప్రకటించారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా సోమవారం వైఎస్సార్‌ కడప జిల్లాకు చేరుకున్న సీఎం జగన్‌ పులివెందుల నియోజకవర్గ పరిధిలో రూ.861.84 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. ఈ రోజు సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా నిలుచున్నానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే కారణమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానని, సొంతగడ్డపై మమ­కారం ఎప్పటికీ తీరేది కాదని వ్యాఖ్యానించారు. 

సీఎం జగన్‌ ప్రారంభించినవి ఇవీ..
పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రాజెక్టులో భాగంగా రూ.20.69 కోట్లతో అధునాతన వసతులతో 4,595 చదరపు మీటర్లలో నిర్మించిన వైఎస్‌ జయమ్మ మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ భవన సముదాయాన్ని సీఎంజగన్‌ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఇందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 58 షాపులు, మొదటి ఫ్లోర్‌ లో 32 షాపులతో పాటు టాయిలెట్‌ బ్లాకులను ఏర్పాటు చేశారు.  

పులివెందులలో 2.79 ఎకరాల్లో రూ.38.15 కోట్లతో ఆధునిక హంగులతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ మినీ సెక్రటేరియేట్‌ కాంప్లెక్స్‌ భవనాన్ని సీఎం  ప్రారంభించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆర్డీవో, స్పందన హాల్, అగ్రికల్చర్, పే–­అకౌంట్స్, సబ్‌ట్రెజరీ, 3 కాన్ఫరెన్స్‌ హాళ్లు, రెండు టాయిలెట్‌ బ్లాక్స్‌ ఏర్పా­టు చేశారు. ఫస్ట్‌ ఫ్లోర్‌లో పాడా ఆఫీస్, పీఆర్, ఆర్‌డబ్ల్యూస్‌ ఇంజనీరింగ్,   సీడీపీవో కార్యాలయాలు, రెండు కాన్ఫరెన్స్‌ హాళ్లున్నాయి. 

రూ.500 కోట్లతో నాబార్డ్, ఆర్‌ఐడీఎఫ్‌–37 నిధులతో నూతనంగా నిర్మించిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ, గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ (జీజీహెచ్‌) భవనాలను ముఖ్యమంత్రి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఏటా 150 మంది వైద్య విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ప్రవేశాలు కల్పిస్తారు. 627 పడకల కెపాసిటీతో టీచింగ్‌ హాస్పిటల్, మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, బాయ్స్, గర్ల్స్ హాస్టల్‌ భవనాలను ఏర్పాటు చేశారు. మెడికల్‌ కాలేజీ ప్రాంగణంలో ప్రధానంగా ఓపీడీ బ్లాక్, ఐపీడీ బ్లాక్, 24/7 అక్యూట్‌ కేర్‌ బ్లాక్‌ భవనాలున్నాయి. 
పులివెందులలో డాక్టర్‌ వైఎస్సార్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ (జీజీహెచ్‌) ఎదుట సిబ్బంది, అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌    

► పులివెందుల మైన్స్‌ సమీపంలో అరటి ప్రాసెసింగ్‌ యూనిట్‌ వద్ద రూ.20.15 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో 5 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ బనానా ప్యాక్‌ హౌస్‌ (పులివెందుల మార్కెట్‌ కమిటీ) భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యమున్న నాలుగు (4/150) కోల్డ్‌ రూములు, 126 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఆరు (6/21) ప్రీ కూలింగ్‌ ఛాంబర్లు, లేబర్‌ క్వార్టర్స్, మిషనరీ రూమ్స్, 60 మెట్రిక్‌ టన్నుల వేయింగ్‌ బ్రిడ్జితో పాటు బనానా, స్వీట్‌ లైమ్‌కు సంబంధించి వేర్వేరుగా నాలుగు గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్‌ లైన్స్‌ ఏర్పాటయ్యాయి. 

► పులివెందుల పట్టణం నడిబొడ్డున రూ.70 లక్షలతో నిర్మించిన వైఎస్‌ఆర్‌ జంక్షన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో ఆకర్షణీయంగా ల్యాండ్‌ స్కెప్‌ మధ్యలో చూపరులను ఆకట్టుకునేలా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు.  

► పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.11.04 కోట్లతో అభివృద్ధి చేసిన సెంట్రల్‌ బౌలే వార్డుకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ జంక్షన్‌కు 500 మీటర్ల దూరంలో అభివృద్ధి చేసిన ఈ మార్గంలో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుల్, రోడ్డుకు ఇరువైపులా 3 మీటర్ల ఫుట్‌పాత్, 2.25 మీటర్ల సీటింగ్‌ ఏరియా, బెంచ్‌లు, 3 మీటర్ల పార్కింగ్‌ ఏరియా, స్టోన్‌ బొల్లార్డ్స్, రోడ్డుకు ఇరువైపులా నగిïÙలతో తయారైన విద్యుత్‌ దీపాలు, పూల కుండీలతో 6 మీటర్ల బీటీ క్యారేజ్‌ వే వంటి ప్రత్యేకతలు పులివెందుల పట్టణ సరికొత్త జీవనశైలికి నాంది కానున్నాయి. 

► పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రాజెక్టులో భాగంగా పట్టణ నడిబొడ్డున రూ.80 లక్షల వ్యయంతో నిర్మించిన గాంధీ జంక్షన్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సర్కిల్‌లో అత్యంత సుందరంగా, జీవకళ ఉట్టి పడేలా నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహం, పూలమొక్కలతో ల్యాండ్‌ స్కేప్, లైటింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

ముఖ్యమంత్రి పర్యటనలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్‌ అవినాష్రెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ ఎంటీ కృష్ణబాబు, కలెక్టర్‌ వి.విజయ్‌రామరాజు, ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్, జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌ కుమార్, పాడ ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్‌ ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు బలరామిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌తోపాటు పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొ­న్నారు. పర్యటన పూర్తి చేసుకుని తిరిగి తాడే­పల్లి బయ­లుదేరిన సీఎం జగన్‌కు కడప విమానాశ్రయంలో సాదరంగా వీడ్కోలు పలికారు.

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మి«థున్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌  అమర్‌నాథరెడ్డి, శాసనమండలి వైస్‌ చైర్మన్‌ జకియాఖానం, ఏపీఎస్‌­ఆర్టీసీ చైర్మన్‌  మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసు­బ్బారెడ్డి,  రామచంద్రారెడ్డి, డీసీ గోవిందురెడ్డి, ర­మే­ష్ యాదవ్, ఎమ్మెల్యేలు  దాసరి సుధా, పి.ర­వీంద్రనాథరెడ్డి, ఎస్‌.రఘురామిరెడ్డి,  మ­ల్లి­కా­ర్జున­రెడ్డి, డాక్టర్‌ సు«దీర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మే­య­ర్‌ సురేష్‌బాబు  వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.  

పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా రూ.175 కోట్ల పెట్టుబడితో 16.63 ఎకరాల్లో నిర్మించిన ఆదిత్య బిర్లా రెడీమేడ్‌ సూట్స్‌ తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పరిశ్రమ స్థాపనతో ఇప్పటికే 500 మంది ఉద్యోగాలను పొందగా మొత్తం 2,100 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 

ఇడుపులపాయ ఎస్టేట్‌లో రూ.39.13 కోట్లతో 16 ఎకరాల్లో నిర్మించిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ పార్క్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. నెమళ్ల పార్కు, పచ్చదనంతో ఆకట్టుకుంటున్న ఇడుపులపాయ ఎస్టేట్‌ దీనిద్వారా పర్యాటక శోభను సంతరించుకుంది.  48 అడుగుల వైఎస్‌ఆర్‌ విగ్రహం, ఆడియో విజువల్‌ బ్లాక్, ఫోటో గ్యాలరీ, ఎంట్రన్స్‌ బ్లాక్, పెవిలియన్‌ బ్లాక్‌, చిల్డ్రన్‌ పార్క్, ట్రాపికల్‌ గార్డెన్‌ లోటస్‌ పాండ్, ఫ్లోరల్‌ పార్క్, పాదయాత్రకు సంబంధించి 21 విగ్రహాల సమూహం ఉన్నాయి.

పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రాజెక్టులో భాగంగా రూ.65.99 కోట్లతో వంద ఎకరాల్లో ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉలిమెల్ల లేక్‌ ఫ్రంట్‌ను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. ఇందులో ఎంట్రన్స్‌ ప్లాజా, ఎంట్రన్స్‌ వాటర్‌ ఫౌంటెన్, ఐ లవ్‌ పులివెందుల, ఎలివేటెడ్‌ స్టెప్స్, ఓ.ఏ.టి. ఏరియా, బ్రిడ్జి, మ్యూజికల్‌ లేజర్‌ ఫౌంటెన్, మేజ్‌ గార్డెన్, కిడ్స్‌ ప్లే ఏరియా, కనెక్టింగ్‌ బ్రిడ్జి, బోటింగ్‌ జెట్టీ, అర్బన్‌ ఫారెస్ట్‌ తదితర ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)