Breaking News

అనారోగ్య బాధితులకు సీఎం జగన్‌ భరోసా.. తక్షణ ఆర్థిక సాయం

Published on Tue, 08/01/2023 - 19:34

సాక్షి, విశాఖ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తమకు కష్టం వచ్చిందని సీఎం జగన్‌ను కలిసిన బాధితులకు తానున్నానంటూ భరోసా కల్పించారు.  మంగళవారం విశాఖ పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ ఇనార్బిట్‌మాల్‌కు చేరుకున్న క్రమంలో అక్కడ ఆర్థోపెడిక్‌ సమస్యతో బాధపడుతున్న గవిడి ఢిల్లీశ్వరరావు(19) తన తల్లి సంతోషితో కలిసి వేచి ఉన్నాడు. ఈ విషయం సీఎం జగన్‌ దృష్టికి రావడంతో అతన్ని పరామర్శించారు. 

తన కుమారుడు  పుట్టుకతో ఆర్దోపెడిక్ సమస్య తో బాధపడుతున్నాడని సీఎం జగన్‌కు బాధితుని తల్లి సంతోషి తెలిపారు.  వారి సమస్యను  విన్న సీఎం జగన్‌ గవిడి ఢిల్లీశ్వరరావుకి  వైద్య సేవలు నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జనను ఆదేశించగా తక్షణమే వైద్య సేవలు నిమిత్తం లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మరో బాధితుడు మోహన్‌(17)ను కూడా ఇన్‌ఆర్బిట్‌ మాల్‌ వద్దే సీఎం జగన్‌ పరామర్శించారు. ఆ యువకుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు.  పెందుర్తి మండలం వేపగుంటకు చేందిన వీరవల్లి మోహన్ తాను 4వ అంతస్తూ నుండి పడిపోయానని, వెన్నపూస దెబ్బ తిన్నదని ఆరోగ్య శ్రీ లో వైద్యం పొందినట్లు తెలిపారు. ఇంకా కోలుకోలేదని, వైద్య సేవల నిమిత్తం సహాయం కోరగా ముఖ్యమంత్రి స్పందిచి ఫిజియో థెరపీ  వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున వీరవల్లి మోహన్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం   లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

చదవండి:  ఇది ఆణిముత్యంలాంటి ప్రాజెక్టు: సీఎం జగన్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)