10న విశాఖకు ముఖ్యమంత్రి జగన్‌

Published on Thu, 02/01/2024 - 04:51

మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఆడుదాం–ఆంధ్రా రాష్ట్ర స్థాయి క్రీడలు ఫిబ్రవరి ఆరు నుంచి పదో తేదీ వరకు విశాఖ వేదికగా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.మల్లికార్జున తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 6న ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆడుదాం–ఆంధ్రా పోటీలు ప్రారంభమవుతాయని, పదో తేదీన వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగే ముగింపు కార్య­క్ర­మానికి సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్యఅతిథిగా హాజర­వు­తార­న్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాల నుంచి క్రీడాకారులు విశాఖ వస్తారని, ఒక్కో జిల్లా నుంచి 130 నుంచి 150 మంది వరకు క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

త్వరలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ సంయుక్త నిర్వహణలో త్వర­­లో రూ.1,500 కోట్లతో పలు అభివృద్ధి పను­లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్ర­మాలు సీఎం జగన్‌ చేతుల మీదుగా జరు­గుతాయని కలెక్టర్‌ వివరించారు. ఇప్ప­టికే అనేక పనులు పూర్తయ్యా యని చెప్పారు. వీఎంఆర్‌­డీఏ ఆధ్వర్యంలో వైజాగ్‌ స్కై గ్లాస్‌ బ్రిడ్జి, సైక్లింగ్‌ వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, వీటికి టెండర్లు కూడా పిలిచా మన్నారు. త్వరలో సీఎం చేతుల మీదుగా వీటికి శంకుస్ధాపనలు జరుగుతా­య­న్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు 14 వేల మంది సిబ్బంది హాజరవుతారని కలెక్టర్‌ వివరించారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)