Breaking News

చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడం: సీఎం జగన్‌

Published on Tue, 06/20/2023 - 11:30

సాక్షి, కృష్ణా: మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై.. రేపు ప్రపంచానికి ఫలాలు అందించాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్‌ మైండ్స్‌.. షైనింగ్‌ స్టార్‌, ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ మనదని ఉద్ఘాటించారాయన.  మంగళవారం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం కింద టాపర్స్‌ను విజయవాడలో సన్మానించే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాం.  కరిక్యులమ్‌ కూడా మారింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ అందుబాటులోకి వచ్చింది.  ప్రతి విద్యార్థికి ట్యాబులు అందిస్తున్నాం. ప్రతీ విద్యార్థికి డిగ్రీ పట్టా ఉండాలనే తాపత్రయంతోనే.. విద్యా దీవెన, విద్యా వసతి చేపట్టాం.  విద్యార్థుల ఫీజుల్ని ప్రభుత్వమే భరిస్తోంది. అత్యుత్తమ కంటెంట్‌తో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థులకు టెక్నాలజీ అందించే ప్రయత్నం చేస్తున్నాం. విదేశాల్లో సీటు తెచ్చుకుంటే ఆ విద్యార్థికి అండగా ఉంటాం.   చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడం. మీ జగన్‌ మామ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని విద్యార్థులను ఉద్దేశించి స్పష్టం చేశారాయన. 

ప్రోత్సాహకాలిలా.. 
జగనన్న ఆణిముత్యాల పేరుతో ఈ నెల 12 నుంచి వారంపాటు సత్కారాలు నిర్వహించనున్నారు. పదవ తరగతిలో ఫస్ట్‌ ర్యాంకర్‌కు లక్ష. ద్వితీయ ర్యాంక్‌ రూ.75 వేలు, తృతీయ ర్యాంక్‌కు రూ. 50 వేలు ప్రొత్సాహకం అందించనుంది ఏపీ ప్రభుత్వం. 42 మందిని ఎంపిక చేసి అందిస్తారు.  

పదో తరగతి విద్యార్థులకు.. 
► జిల్లా స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.50,000, ద్వితీయ– రూ.30,000, తృతీయ– రూ.15,000, విద్యార్థులు 609 మంది. 
► నియోజకవర్గ స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.15,000, ద్వితీయ– రూ.10,000, తృతీయ–రూ.5,000,  విద్యార్థులు 681 మంది. 
► పాఠశాల స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.3,000, ద్వితీయ–రూ.2,000, తృతీయ– రూ.1,000, విద్యార్థులు 20,299 మంది.  

ఇంటర్‌ విద్యార్థులకు.. 
► రాష్ట్ర స్థాయి గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.1,00,000 చొప్పున 26 మంది విద్యార్థులకు ప్రదానం  
► జిల్లా స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.50,000 చొప్పున 391 మంది విద్యార్థులకు ప్రదానం  
► నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.15,000 చొప్పున 662 మందికి ప్రదానం  
► మొత్తం విద్యార్థుల సంఖ్య: 22,710  

ర్యాంకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరినీ సత్కరించనున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి నగదుతో పాటు సర్టిఫికేట్, మెడల్‌ అందజేస్తారు. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)