Breaking News

ఇళ్లు ఫుల్‌ స్పీడ్‌!

Published on Fri, 05/12/2023 - 04:14

సాక్షి, అమరావతి:  సీఆర్డీఏ పరిధిలో గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన దాదాపు 50 వేల మంది నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద వీరికి ఇళ్ల పట్టాల జారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇది ఇళ్లు లేని నిరుపేదల చిరకాల వాంఛను నెరవేర్చే బృహత్తర కార్యక్రమమని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
  
హైకోర్టుకు అదనపు భవనం.. కోర్టు హాళ్లలో సదుపాయాలు 
అమరావతిలో 50,004 మంది పేదలకు 1,402.58 ఎకరాల్లో ఇళ్ల పట్టాలకు సంబంధించి జంగిల్‌ క్లియరెన్స్, ల్యాండ్‌ లెవలింగ్‌ పనులు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు పది లేఅవుట్లలో, ఎన్టీఆర్‌ జిల్లా లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు కేటాయించనున్నారు. దాదాపు 180 కి.మీ మేర అంతర్గత గ్రావెల్‌ రోడ్ల పనులు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. హైకోర్టు అదనపు భవన నిర్మాణం కూడా పూర్తవుతున్నట్లు చెప్పారు. 76,300 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ భవనం అందుబాటులోకి వస్తోందని, 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన పనులు కూడా జరుగుతున్నట్లు వివరించారు.   
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సుందరంగా బెజవాడ రివర్‌ బెడ్‌ 
విజయవాడలో కృష్ణానది వరద ముప్పు తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ ద్వారా ఏర్పడిన రివర్‌ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. రివర్‌ బెడ్‌పై వాకింగ్‌ ట్రాక్‌ సహా వివిధ సుందరీకరణ పనుల గురించి అధికారులు వివరించారు. నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా చర్యలు తీసుకోవాలని  సీఎం సూచించారు.   

పరిశుభ్రంగా విశాఖ బీచ్‌లు 
విశాఖలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అందుకు అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబా­టులో ఉంచాలన్నారు. వీటి ద్వారా ఎప్ప­టి­కప్పుడు వ్యర్థాలను తొలగించాలన్నారు. పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మెరుగుపడుతుందన్నారు.  

గుడివాడ టిడ్కో ఇళ్లు జూన్‌లో పంపిణీ 
ఫేజ్‌–1 కింద 1,50,000 టిడ్కో ఇళ్లకు సంబంధించి 1.39 లక్షల గృహాల నిర్మాణం పూర్తి కాగా ఇప్పటికే 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లను అప్పగించినట్లు అధికారులు తెలిపారు. జూన్‌ నాటికి మిగతా ఇళ్లను కూడా లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. రెండో విడతకు సంబంధించి 1,12,092 ఇళ్లను సెప్టెంబరు – డిసెంబరు మధ్య లబ్ధిదారులకు అందిస్తామన్నారు. గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్లను జూన్‌ మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సమీక్షలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి.బసంత్‌కుమార్, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, రీసర్వే ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ సుబ్బారావు, మెప్మా ఎండీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)