Breaking News

పేదల ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లండి: సీఎం జగన్‌

Published on Thu, 05/18/2023 - 13:36

సాక్షి, అమరావతి: గృహనిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందించారు. 

  • గడచిన 45 రోజుల్లో హౌసింగ్‌ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేశామన్న అధికారులు.
  • ఇప్పటివరకూ 3.70 లక్షల ఇల్లు పూర్తి.
  • రూఫ్‌ లెవల్‌.. ఆపైన నిర్మాణంలో ఉన్నవి 5.01లక్షల ఇళ్లు.
  • త్వరలోనే వీటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించిన అధికారులు.
  • మరో 45 రోజుల్లో వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
  • బేస్‌మెంట్‌ లెవల్‌ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 8.64లక్షలుపైనే.
  • వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామన్న అధికారులు.
  • సీఎం ఆదేశాలమేరకు జగనన్నకు చెబుదాం స్పెషల్‌ ఆఫీసర్లు కూడా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారని వెల్లడించిన అధికారులు.
  • సీఎం ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణంలో వాడే మెటీరియల్‌ నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నామన్న అధికారులు.
  • సీఎం ఆదేశాలమేరకే ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం.
  • ఇప్పటివరకూ 11.03 లక్షలమందికి రూ. 35 వేల చొప్పున రుణాలు.
  • రూ. 3886.76 కోట్లమేర పావలా వడ్డీకే రుణాలు.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...

  • సీఆర్డీయే ప్రాంతంలో పేదల ఇళ్లనిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం.
  • ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన అనంతరం.... వేగంగా నిర్మాణ పనులును ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలన్న సీఎం.
  • ఇళ్లులేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.
  • పేదలకు ఎంత త్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయన్న సీఎం.
  • సీఆర్డీయే ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్నిరకాల చర్యలు తీసుకున్నామన్న అధికారులు.
  • ల్యాండ్‌ లెవలింగ్‌ పనులు చేశామన్న అధికారులు.
  • సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని సీఎం ఆదేశం.
  • 5024 టిడ్కో ఇళ్లను అందించనున్న ప్రభుత్వం.

ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్,  ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఏ ఎండీ ఇంతియాజ్,  ఏపి టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ లక్ష్మీషా, మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టర్‌ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్‌ బలం అదే.. ఇదీ లెక్క..!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)