Breaking News

విద్యాశాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published on Thu, 09/14/2023 - 17:49

సాక్షి, అమరావతి: విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు, ప్రగతిపై సీఎం చర్చించారు. ప్రాథమిక విద్యలో నూటికి నూరు శాతం పిల్లలు బడిలోనే ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ఇచ్చిన ట్యాబుల వినియోగంపై సీఎం సమీక్షించారు. ఈ ఏడాది రెండో విడత ట్యాబులు ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. టోఫెల్‌ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధపైనా సీఎం ఆరా తీశారు.

వారంలో మూడు రోజులపాటు మూడు పీరియడ్ల మేర శిక్షణ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. అనంతరం మన బడి నాడు–నేడు పనులపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం వచ్చాక బడి పిల్లలకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా డబ్బు ఖర్చుచేస్తున్నామన్నారు.

‘‘మెనూను మార్చి పిల్లలకు రుచికరమై, పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. రాగిజావను కూడా ప్రవేశపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వాలిటీ తగ్గకూడదు. నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతిరోజూ కూడా పిల్లలకు అందిస్తున్న ఆహారంపై పర్యవేక్షణ ఉండాలి’’ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.
చదవండి: Pawan : ‘విడివిడిగా పోటీ చేస్తే వైఎస్సార్‌సీపీని ఆపలేం’ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)