Breaking News

ప్రతీ ఆర్బీకే సెంటర్‌లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు: సీఎం జగన్‌

Published on Fri, 06/02/2023 - 10:10

►రూ. 361 కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్‌ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు పంపిణీ చేసిన సీఎం జగన్‌

►13, 573 ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసిన సీఎం జగన్‌

►రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ. 125.48 కోట్ల సబ్సిడీ జమ చేసిన సీఎం జగన్‌

►జెండా ఊపి వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం మెగా మేళా ప్రారంభించిన సీఎం జగన్‌

►రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం జగన్‌

సీఎం జగన్‌ కామెంట్స్‌

►వైఎస్సార్‌ యంత్ర సేవ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం

►అక్టోబర్‌లో 7 లక్షల మందికి లబ్ధి కలిగేలా యంత్రాలు అందిస్తాం

►రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

►ఇప్పటికే 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు

►ప్రతీ ఆర్బీకే సెంటర్‌లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు

►ప్రతి ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు

►ప్రతి ఆర్బీకే పరిధిలో అందుబాటులోకి రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయం పరికరాలు

►ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్లు

►రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం

►ప్రతి ఆర్బీకే సెంటర్‌లో యంత్రాలకు 15 లక్షలు కేటాయించాం

►రైతన్నకు అండగా వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం

►రైతులకు ఏం అవసరమో వారినే అడిగి అందజేస్తాం

►గుంటూరుకు చేరుకున్న సీఎం జగన్‌

►వైఎస్సార్‌ యంత్ర సేవా-పథకం మెగా మేళా-2ను ప్రారంభించనున్న సీఎం జగన్‌

►చుట్టుగుంట సెంటర్లో రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ

►గుంటూరు బయలుదేరిన సీఎం జగన్

►చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటు­న్న కూలీల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ­పెట్టిన పథకం ‘వైఎస్సార్‌ యంత్ర సేవ’

►గుంటూరు చుట్టుగుంట సెంటర్‌ వద్ద ట్రాక్టర్లు, కం­బైన్డ్‌ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు.


►వంద శాతం యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అం­­చనాతో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్‌ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా.. ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని సీఎం బటన్‌ నొక్కి నేరుగా జమచేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాల పంపిణీ చేస్తారు. 

►ఈ ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారికి సాగు వ్యయం తగ్గించి నికర ఆదాయం పెంచాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలకను­గు­ణంగా వైఎస్సార్‌ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర ప్రభు­త్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.15లక్షల విలువైన యంత్ర పరికరాలను ఆర్బీకే స్థాయిలోనూ, రూ.25లక్షల విలు­వైన కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో కూడిన యంత్ర పరికరాలను క్లస్టర్‌ స్థాయిలోనూ ఏర్పాటు­చేస్తోంది.

►ఎంపికైన రైతు గ్రూపులు కోరుకున్న యంత్ర పరి­క­రాల కొనుగోలు కోసం 40 శాతం రాయితీనందించడమే కాదు.. యంత్ర విలువలో 50 శాతం బ్యాంకు రుణాన్ని కూడా ప్రభు­త్వం సమకూరుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.690.87 కోట్ల అంచనాతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాల్లో 3,800 ట్రాక్టర్లు, 391 హార్వెస్టర్లు, 22580 వివిధ రకాల యంత్ర పని­మున్లను సమకూర్చారు. సబ్సిడీ రూపంలో రూ.240.67 కోట్లు రైతు గ్రూపుల ఖాతాలకు నేరుగా జమచేసింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?