Breaking News

సీఎం జగన్‌ చొరవతో కిడ్నీ వ్యాధి బాధితునికి భరోసా 

Published on Fri, 04/14/2023 - 07:40

ఒంగోలు అర్బన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో కిడ్నీ వ్యాధి బాధితునికి భరోసా లభించింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడి కుటుంబ సభ్యులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఒంగోలులోని ప్రకాశం భవనంలో ప్రభుత్వం తరఫున గురువారం రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.5 లక్షలు వచ్చేలా చర్యలు చేపట్టడంతోపాటు వివిధ రూపాల్లో ఆదుకుంటామన్నారు.

ఈబీసీ నేస్తం రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మార్కాపురం వచ్చిన సందర్భంగా బాధితుడి తల్లి మారమ్మ ఆయనను కలిసి తన కుమారుడు శ్రీనివాసులు పరిస్థితిని వివరించింది. బీఎస్సీ నర్సింగ్‌ చదివి ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడని, తనొక్కడే కుటుంబానికి ఆధారమని తెలిపింది. కిడ్నీ చెడిపోయి ఆస్పత్రిలో ఉన్నాడని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని వైద్యులు తెలిపారని సీఎంకు వివరించింది.
చదవండి: టిడ్కో ఇళ్లపై విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం జగన్‌

స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌ బాధిత కుటుంబానికి సహాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో బాధితుడి తల్లి మారమ్మను గురువారం కలెక్టరేట్‌కు పిలిపించి తక్షణ ఆరి్థక సహాయంగా రూ.లక్ష చెక్కు అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.5 లక్షల సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. బాధితుడి అర్హతను బట్టి ఉద్యోగం కూడా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.  ఇడుపూరు లే–అవుట్‌లో ఇంటిస్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)