Breaking News

పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు సీఎం జగన్: సజ్జల

Published on Thu, 12/21/2023 - 11:11

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత జగన్‌దేనన్నారు. ఇచ్చిన హమీలను నెరవేర్చి.. పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. ‘‘తండ్రిని మించిన తనయుడిగా జగన్‌ పాలన అందిస్తున్నారు. పూర్తి పారదర్శకంగా సంక్షేమం పథకాలు అందించిన ఘనత జగన్‌దే. అవినీతికి తావులేకుండా, అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాం’’ అని సజ్జల పేర్కొన్నారు.

‘‘తండ్రికి మించిన తనయుడుగా జగన్ పేరు తెచ్చుకున్నారు. పేదల చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆస్పత్రులు ఇలా అన్నీ అందుబాటులోకి తెచ్చారు. అన్నీ కళ్లముందే కనిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు. జగన్ పాలన పారదర్శకంగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల కోసం మారీచశక్తులు మళ్లీ ఏకం అయ్యాయి. గతంలో మోసం తప్ప ప్రజలకు ఇంకేమీ చేయలేదు. ప్రజల కష్టాలు, కన్నీళ్ళు చూశానని లోకేష్ అంటున్నారు. మరి మంత్రిగా చేసినప్పుడు అవి కనపడలేదా?. అధికారంలో ఉన్న మిమ్మల్ని ప్రజలు ఈడ్చి కొట్టారు. అయినాసరే మళ్ళీ ప్రజలను నమ్మించేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకుని ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు.

సీఎం జగన్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రా­లతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎ­త్తున సేవా కార్యక్రమాలను వైఎ­స్సార్‌సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియో­జకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్న­దానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ  చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సోషల్‌ మీడియాలో సీఎం జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి
ఇదీ చదవండి: జయహో జననేతా..ఏ దైవం పంపించాడో!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)