భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..
Breaking News
పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు
Published on Sun, 12/25/2022 - 09:16
సాక్షి, వైఎస్సార్ కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మూడో రోజున పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.
సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ప్రజలందరూ క్రిస్మస్ పండుగను జరుపుకోనున్నారు. కాగా, క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు సీఎం వైఎస్ జగన్.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Tags : 1