Breaking News

నార్పలలో సీఎం జగన్‌ గొప్ప మనసు.. కలెక్టర్‌కు ఆదేశాలు, బాధితులకు సాయం

Published on Thu, 04/27/2023 - 21:45

సాక్షి, అనంతపూర్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. జిల్లాలోని నార్పలలో బుధవారం రోజున జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా అనారోగ్య బాధితులను కలిసి సీఎం జగన్‌ నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి సాయం చేయాలని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడిన అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమి అవసరమైన సాయం అందజేశారు. తమ గోడు విని సత్వరం స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు.
(చదవండి: AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ ఇదే)

బాధితుల పూర్తి వివరాలు...


1.డి.రాజు, పి. అరుణ
రాజు, అరుణల కుమారుడు ధనుష్‌ జెనెటికల్‌ సమస్యలతో బాధపడుతున్నాడని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆ కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం, ధనుష్‌కు అవసరమైన వైద్యచికిత్సలు ఉచితంగా చేయించాలని నిర్ణయం.
 

2.యోగిశ్వరి
యోగిశ్వరి భర్త రంగారెడ్డి ప్రమాదంలో మరణించారని, ఇద్దరు కుమారులతో తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయం.
 

3. రామచంద్ర, భవాని
రామచంద్ర సోదరి భవాని కుమారుడు బాలచంద్ర (11) అంగవైకల్యంతో బాధపడుతున్నాడని సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ.1 లక్ష ఆర్ధిక సాయం, వీల్‌ ఛైర్‌.
 

4. చాకలి నవ్య
ఇటీవల జరిగిన కెమికల్‌ బ్లాస్ట్‌ లో తన భర్తను కోల్పోయానని, ఇద్దరు చిన్న పిల్లలతో తన కుటుంబ పోషణ భారంగా మారిందని సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ.7 లక్షల ఆర్ధిక సాయం.
 

5. ఏ.నారాయణమ్మ
తన కుమారుడు జశ్వంత్‌ రెడ్డి (6) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం, ఉచితంగా చికిత్స.
 

6. జి.రామాంజి
విద్యుత్‌శాఖలో టెంపరరీగా పనిచేస్తున్న తనకు విద్యుత్‌షాక్‌తో కుడి చెయ్యి కోల్పోయానని, సీఎం దృష్టికి తీసుకురాగా ఆ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం, విద్యుత్‌ శాఖలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా కాంట్రాక్ట్‌ ఉద్యోగం.

7. వి.అమర్‌నాథ్‌ రెడ్డి
రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురాగా ఆ కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం

8. బి.గంగయ్య
తన భార్య నాగలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం, వీల్‌ ఛైర్‌.

9. బి.కొండారెడ్డి
తన మేనల్లుడు చేతన్‌ రెడ్డి కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం

10. ఎస్‌.నబీరసూల్‌
తనకు వైకల్యం కారణంగా ట్రైసైకిల్‌ ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకురాగా ఆయనకు ట్రైసైకిల్‌ అందజేసిన అధికారులు.
(చదవండి: మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే?)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)