Breaking News

అవేర్‌ 2.0తో ముందుగానే వర్షపాతం అంచనా వేసేస్తాం

Published on Tue, 08/12/2025 - 05:52

సాక్షి, అమరావతి: అవేర్‌ 2.0 వెర్షన్‌తో ముందే వర్షపాతాన్ని అంచనా వేసేస్తామని సీఎం చంద్ర­బాబు తెలిపారు.  సోమ­వారం సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కేంద్రాన్ని సీఎం సందర్శించారు. ఆర్టీ­జీఎస్‌లోని అవేర్‌ 2.0 వెర్షన్‌ను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఈ విధానం ద్వారా నదు­ల్లోకి ఏ సమయంలో ఎంత వర్షపు నీరు వస్తుంది, కురిసిన వర్షం భూమిలోకి ఎంత ఇంకుతోంది, వర్షపు నీటి సమర్థ వినియోగంపైనా రియల్‌ టైమ్‌ డేటా విశ్లేషణ చేసి సంబంధిత శాఖలను ఆర్టీజీఎస్‌ అప్రమత్తం చేయాలని సూచించా­రు. 

వరదలు, తుపాన్ల సమయంలో రోడ్లపై వరద నీటిని పరిశీలించి ఆ ప్రాంత ప్రజలను ఆర్టీజీఎస్‌ అప్రమత్తం చేయాలన్నారు. పౌరులు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు ఎలా పాల్పడిందీ వారికి వీడియో లు పంపి, అలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా చైతన్యం తేవాలని తెలిపారు. రాష్ట్రంలో డ్రోన్‌ సేవలు విసృత్తం చేయాలని డ్రోన్‌ కార్పొరేషన్‌కు చె ప్పారు. డ్రోన్ల వినియోగం ద్వారా రైతులు పురుగు మందుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించేలా చూడాలని చెప్పారు. 

అంటు వ్యాధుల నివారణకు, దోమల వ్యాప్తిని అరికట్టడానికి డ్రోన్లను వినియోగించుకోవాలన్నారు. ఆర్టీజీఎస్‌ డేటా లేక్‌ పనులు నవంబరుకల్లా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి మన మిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా 700 ప్రభుత్వ సేవలను అదిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనుల గురించి కూడా ఒక శాస్త్రీయ విశ్లేషణ ఉండాలని సూచించారు.   

సరుకు రవాణాకులాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌ 
ఏపీతో  పాటు పొరుగు రాష్ట్రాలకు సరకు రవాణా నిర్వహణకు లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను ఈ కార్పొరేషన్‌ ద్వారానే నిర్వహించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షించారు. 

రాష్ట్రంలో 20 పోర్టులు, మరిన్ని విమానాశ్రయాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్దేశించారు. పోర్టులు, ఎయిర్‌ పోర్టుల సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా మార్చి వీటిని అనుసంధానిస్తూ శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలన్నారు. కుప్పం, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత సమయానికి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఎయిర్‌ పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానించేలా అంతర్గత రోడ్ల నిర్మాణం ఉండాలని, అవసరమైతే వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ద్వారా చేపట్టాలని సూచించారు.  

మారిటైం పాలసీలో మార్పులు..! 
పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు మారిటైమ్‌ విధానంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. పోర్టులు, టెర్మినల్స్, షిప్‌ బిల్డింగ్‌ యూనిట్లు, అంతర్గత జల రవాణా మార్గాలు, క్రూయిజ్‌ టెర్మినళ్ల ఏర్పాటుకు మార్గం సుగమం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

కేంద్రం అమలు చేస్తున్న షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌ స్కీం పాలసీకి అనుగుణంగా మారిటైం పాలసీలో మార్పులు చేయాలని అధికారులు ప్రతిపాదించగా అందుకు ఆమోదం తెలిపారు. షిప్‌ బిల్డింగ్‌ యూనిట్ల నిర్మాణం కోసం మచిలీపట్నం, మూలపేట, చినగంజాం లాంటి ప్రాంతాల్లో కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని అధికారులు తెలిపారు. స్థానిక మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. 

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)