Breaking News

మెసేజ్‌ పెడితే సర్టిఫికెట్‌ పంపిస్తాం

Published on Sun, 12/01/2024 - 03:48

బొమ్మనహాళ్‌ : రెవెన్యూలో ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా ఒక్క మెసేజ్‌ పెడితే చాలు మీకు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దాదాపు 150 పౌరసేవల్ని ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తామన్నారు. పెన్షన్లు సక్రమంగా ఇచ్చారా, లేదా అని తెలుసుకోవడానికి నేరుగా ఫోన్లు కూడా చేస్తామన్నారు. ఎవరైనా లంచం తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. శనివారం అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లు గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 

తొలుత గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో పాల్తూరు రుద్రమ్మ ఇంటికి వెళ్లి వితంతువు పెన్షన్‌ రూ.4 వేలు, బోయ భాగ్యమ్మ ఇంటి వద్దకు వెళ్లి రూ.15 వేలు వికలాంగుల పెన్షన్‌ అందజేశారు. నేమకల్లు ఆంజనేయస్వామిని దర్శించుకుని, అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో మాట్లాడారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఐదు నెలల్లో రూ.18 వేల కోట్లు పేదలకు ఇవ్వడం ద్వారా తన జీవితం ధన్యమైందన్నారు.

రాష్ట్రంలో తాము ప్రజల ఆరోగ్యం కోసం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మద్యం ధరలు కూడా తగ్గించామని తెలిపారు. అధిక ధరలకు విక్రయించకూడదన్నారు. ఎక్కడా కూడా బెల్టు షాపులు పెట్టకూడదని, ఎవరైనా బెల్టు షాపులు తెరిస్తే తాను బెల్ట్‌ తీయాల్సి వస్తుందని హెచ్చరించారు.  
 
మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు 
‘మీ ఊర్లో ఇసుక మీరే తెచ్చుకునే స్వేచ్ఛ ఇచ్చాను. ట్రాక్టర్‌ను తీసుకెళ్లి ఇసుకను ఉచితంగా తెచ్చుకోండి. ఎవరైనా అడ్డొస్తే నా పేరు చెప్పండి. అవసరమైతే నిలదీయండి. రెండో గేర్‌లో పోతా ఉంటే నాలుగో గేర్లోకి మార్చి స్పీడ్‌ పెంచండి’ అని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఎవరైనా గంజాయి పండించినా, అమ్మినా, మత్తు పదార్థాలు విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు. 

ప్రస్తుతం డ్రోన్స్‌ నిఘా పెట్టామని, దానికి ‘డేగ’ అని పెరు పెట్టామని తెలిపారు. ‘నా తమ్ముళ్లకు 4 లక్షల ఉద్యో­గాలు ఇప్పించే బాధ్యత మాది. త్వరలో నైబర్‌హుడ్‌ కాన్సెప్ట్‌ తీసుకొస్తున్నాం. యువత అందరూ సెల్‌ఫోన్‌లో రూ.10 వేలు సంపా­దించే మార్గం చూపిస్తాం. ఇంట్లో పని చేసుకుంటూనే తీరిక స­మయంలో మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశం చూపిస్తాం’ అని అన్నారు. 

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)