Breaking News

ఐఏఎస్‌లం.. అన్నీ తెలుసనుకోవద్దు

Published on Tue, 02/10/2026 - 02:42

సాక్షి, అమరావతి: ఐఏఎస్‌లు అయిపోయాం.. అన్నీ తెలుసనే ధోరణి వీడి నేర్చుకోవడం, తెలుసుకోవడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, కార్యదర్శులు, శాఖాధిపతులకు సూచించారు. 2025–26 జీఎస్‌డీపీ వృద్ధి 12.16 శాతం లక్ష్యం అనుకుంటే ఇప్పుడు 9.88 శాతమే వృద్ధి నమోదైందని, అందరూ సరిగా పనిచేస్తే 13 శాతం వృద్ధి రావాలని సీఎం పేర్కొన్నారు. ఎవరు సరిగా పనిచేయడం లేదో తమ వద్ద వివరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అంచనాలను ఇచ్చామని, ఆ మేరకు వృద్ధి వస్తోందా..? లేదా..? అనేది కలెక్టర్లు దృష్టి సారించడంతోపాటు తెలియకపోతే తెలుసుకోవడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. సోమ­వారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లతో సీఎం సమావేశం నిర్వహించారు.

జీఎస్‌డీపీ వృద్ధి, విద్య, వైద్య, ఆదాయ ఆర్జన తదితర రంగాలపై సమీక్షించారు. జీఎస్‌డీపీ వృద్ధి, తలసరి ఆదాయం లక్ష్యాల సాధన బాధ్యత కలెక్టర్లతోపాటు మంత్రులదేనని సీఎం స్పష్టం చేశారు. లక్ష్యాలు సాధించకపోవడానికి నిర్లక్ష్యం లేదా తెలియకపోవడమే కారణమన్నారు. ఈ ఏడాది లక్ష్యాల్లో వెనుకబడితే వచ్చే ఏడాది కవర్‌ చేయాలని, లేదంటే ఆ శాఖలు డిఫాల్టర్లు అవుతాయని వివరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాలం చెల్లిన, అవసరం లేని చట్టాలు రద్దు చేస్తామన్నారు. కేంద్రం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు.

రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఆడిట్‌ చేయాలని చెప్పారు. రాత్రింబవళ్లూ పనిచేయడం కాదని, మనసు పెట్టి పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. ‘నాకు సలహాలు ఇవ్వద్దు..  ఏమి చేస్తే ఫలితాలు వస్తాయో అది చేసి చూపించండి’ అని సీఎం సూచించారు. తనతోపాటు కింది స్థాయి వరకు ఉద్యోగులంతా సమష్టిగా పనిచేస్తేనే ఫలితాలు వస్తాయన్నారు. యూరప్‌ దేశాల్లో వృద్ధులు పెరిగిపోతున్నారని, రాష్ట్రంలో జనాభా తగ్గిపోతోందని, ఈ నేపథ్యంలో సంతానం పెంచేందుకు ప్రోత్సహకాలతో జనాభా నిర్వహణ విధానాన్ని మార్చిలో అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి విధానం అమల్లోకి వస్తుందన్నారు.  

కుప్పంలోనే 14.9 శాతం మందికి బాల్య దశలోనే గర్భధారణ  
రాష్ట్రంలో సిజేరియన్‌ డెలివరీలను తగ్గించి సాధారణ డెలివరీలు పెరిగేలా అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు. బాల్య వివాహాలపైనా సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా కుప్పంలోనే 14.9 శాతం మంది బాల్య దశలోనే గర్భం దాల్చుతున్నారని, ఇవి కూడా జనాభాపై ప్రభావం చూపుతున్నాయని ఓ అధికారి వివరించారు. 71 లక్షల మంది పిల్లల ఆరోగ్య డేటాను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాల్సిందిగా సీఎం సూచించారు. హాస్టల్‌ విద్యార్థులకు తరుచూ అనారోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు, మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదని వెల్లడించారు. పన్నులను పూర్తి స్థాయిలో వసూలు చేయాలని సీఎం పేర్కొన్నారు. అటవీ శాఖ దగ్గర ఉన్న ఎర్ర చందనం అమ్మకం ద్వారా అధిక ఆదాయం వస్తుందని అంచనా వేశామని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు మురిగిపోతే అధికారులే బాధ్యత వహించాలన్నారు. అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిట్ల విషయంలో జిల్లా కలెక్టర్లు తక్షణం కేవైసీ చేపట్టాలన్నారు. 1,04,727 పీడీ ఖాతాల్లో ఉన్న అన్‌ క్లైమ్డ్‌ డిపాజిట్ల విలువ రూ.148 కోట్లుగా ఉన్నాయని చెప్పారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి రూ.26,021 కోట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నారు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)