Breaking News

పట్టణాల్లో పౌర సేవలు అవుట్‌ సోర్సింగ్‌కు

Published on Fri, 03/13/2026 - 03:50

సాక్షి, అమరావతి :  పట్టణ స్థానిక సంస్థల పౌర సేవలన్నింటినీ అవుట్‌ సోర్సింగ్‌ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. మున్సిపల్‌ బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించడంతో పాటు ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా భూములను సేకరించి పీపీపీ విధానంలో ప్రాజెక్టులను చేపట్టాలని  సూచించారు. సచివాలయంలో గురువారం రెండోరోజు కలెక్టర్ల సదస్సులో పలు శాఖలపై సీఎం సమీక్షించారు. పట్టణ స్థానిక సంస్థలన్నింటిలోనూ విద్యుత్‌ వాహనాలను తీసుకురావాలని ఆదేశించారు. 

అభివృద్ధి చేస్తున్నా జీఎస్టీ ఆదాయం ఆ మేర ఎందుకు పెరగడంలేదనే విషయంపై అధ్యయనం చేయాలని వాణిజ్య పన్నులు, ఆర్థిక శాఖను ఆదేశించారు. అభివృద్ది జరిగితే ఆ మేర ఆదాయం పెరగాలని.. కానీ, ఎక్కడో తేడా కనిపిస్తోందన్నారు. ఆర్టిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగించి పన్ను ఎగవేతకు చెక్‌ పెట్టాలన్నారు. గత ఏడాది కన్నా ఈ  ఏడాది సొంత ఆదాయం పన్ను వృద్ధి కేవలం నాలుగు శాతమే ఉందని.. అలాగే, ఎక్సైజ్‌ ఆదాయం గత ఏడాది కన్నా ఈ ఏడాది ఐదుశాతం మేర తగ్గిందని ముఖ్యమంత్రి చెప్పారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. 

కొందరు అటవీ అధికారులతో ఇబ్బందులు.. 
అటవీ శాఖపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు ఈ శాఖాధికారుల అసాధ్యమైన ఆలోచనలతో ఇబ్బందులు వస్తున్నాయి. ఆచరణ సాధ్యంకాని ఆలోచనలతో వ్యవహరిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా? శ్రీశైలంలో అటవీ శాఖాధికారులు భక్తులను అడ్డుకున్నారు. ఆ తర్వాత రోజు తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చింది. బద్వేలులోనూ అటవీ శాఖ ఇదే తరహాలో వ్యవహరించింది. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మాట్లాడా. మరోసారి మాట్లాడతా. 

అటవీ శాఖాధికారులు పీపుల్స్‌ ఫ్రెండ్లీగా మారాలి. జిల్లాల్లో పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ చూపుతూ పెట్టుబడుల మీటింగులు పెట్టాలి. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో జిల్లాల వారీగా ర్యాంకులిస్తాం. జాతీయ రహదారులపై వే సైడ్‌ ఎమినిటీస్, ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు, నైట్‌హాల్ట్‌ కోసం గదుల నిర్మాణం చేపడితే పెట్టుబడులు వస్తాయి. ఏపీఐఐసీ ద్వారా చేసే భూ కేటాయింపుల్లో కలెక్టర్లు ఐదెకరాల వరకూ చేసేలా వారికి ఆథరైజేషన్‌ ఇవ్వాలి. విజయవాడలోని డిస్నీల్యాండ్, భవానీ ఐల్యాండ్‌లను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. త్వరలో సంక్షేమ క్యాలెండర్‌ విడుదల చేస్తాం.  

పవన్, లోకేశ్‌ డుమ్మా.. 
ఇక రెండ్రోజుల ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ డుమ్మా కొట్టారు. కీలక మంత్రులు హాజరుకాకపోవడంపట్ల అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తంచేసింది. కార్యక్రమంలో భాగంగా ‘అరకు కౌని’ పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్‌ మిల్లెట్‌ ఫుడ్‌ మెనూను సీఎం ఆవిష్కరించి స్టాల్‌ను సందర్శించారు. సమావేశంలో సీఎం గొప్పలు పోవడం  అధికారులకు అసహనం కలిగించింది. గతంలో సీఎంగా ఉన్నప్పుడు అది చేశా.. ఇది చేశానని చెప్పడం కేవలం కాలక్షేపానికి మాత్రమే పనికొస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)