Breaking News

ఏపీ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో రద్దు

Published on Wed, 09/11/2024 - 18:08

సాక్షి, విజయవాడ: ఏపీ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను(సెబ్‌) ప్రభుత్వం రద్దు చేసింది.  సెబ్‌ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సెబ్ విభాగానికి కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. సెబ్‌లో వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులను వారి మాతృశాఖల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందిని, ఫర్నిచర్‌, వాహనాలను, సీజ్ చేసిన వస్తువులను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని పేర్కొంది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే త్వరలో మద్యం అమ్మకాలను ప్రైవేటు పరం చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెబ్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం గత ప్రభుత్వం ఈ సెబ్‌ను ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా సెబ్ పని చేసింది. ఎక్సైజ్ శాఖలోని 70 శాతం ఉద్యోగులను.. సిబ్బందిని సెబ్‌కు కేటాయించింది. బెల్టు షాపులు, గంజాయి నియంత్రణ కోసం సెబ్‌ పనిచేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)