Breaking News

మహిళా ఎస్‌ఐ జుట్టు పట్టుకుని జులుం..

Published on Fri, 03/14/2025 - 06:00

తప్పతాగండి.. ఇష్టానుసారం వ్యవహరించండంటూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఊరూరా, వీధి వీధిన మద్యం వరద పారిస్తోంది. 24/7 మద్యం లభిస్తుండటంతో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఎదుట ఉన్న వారు ఎవరన్న కనీస విచక్షణ లేకుండా దాడులకు తెగబడుతుండటం పరిపాటిగా మారింది. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడలో మంగళవారం రాత్రి వేణుగోపాలస్వామి తీర్థం సందర్భంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్‌ డ్యాన్స్‌లో తప్పతాగిన యువకులు కొందరు డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించారు. బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్‌ఐ దేవి ఇలా చేయడం తగదంటూ వారిని వారించారు.

దీంతో మాకే అడ్డుచెబుతావా.. అంటూ ఆ యువకులు ఆమె జుట్టు పట్టుకుని పక్కకు ఈడ్చేశారు. ఫోన్‌ లాక్కుని.. ఆమె చేతులు లాగుతూ, దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఆమె భయంతో పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అప్పటికీ శాంతించని ఆ యువకులు గేట్లు లాగుతూ, పూల కుండీలు విసిరేసి బీభత్సం సృష్టించారు. ఆమె ఫోన్‌ చేసి పరిస్థితి చెప్పడంతో అదనంగా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ మాయదారి మద్యం వల్లే ఇలా జరిగిందంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. – సాక్షి నెట్‌వర్క్‌

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి