Breaking News

ఉండవల్లిలో ఉద్రిక్తత.. బాబు సర్కార్‌ విధ్వంసకాండ!

Published on Sat, 07/11/2026 - 11:24

సాక్షి, గుంటూరు: ఉండవల్లిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరావతి ప్రాంతంలో బాబు సర్కార్‌ విధ్వంసకాండ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. రాజధాని పేరుతో అధికారులు బలవంతపు భూసేకరణకు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా పచ్చటి పంటలను ధ్వంసం చేశారు. 

వివరాల మేరకు.. శనివారం ఉదయం సీఆర్‌డీఏ సిబ్బంది.. జేసీబీల సాయంతో తమ పంటలను ధ్వంసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడే ఉన్న పోలీసులు.. రైతులను బలవంతంగా లాక్కెళ్లారు. మహిళా రైతులు అని కూడా చూడకుండా.. పోలీసులు వారిని ఈడ్చుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ భూములను అన్యాయంగా లాక్కుంటున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. ఇక, అంతకుముందు.. సీఆర్‌డీఏ అధికారులు భూసేకరణ పేరుతో రైతుల ఇంటికే వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్లడం గమనార్హం. 

బలవంతంగా రైతులను తరిమేశారు: దొంతిరెడ్డి

ఉండవల్లిలో బలవంతపు భూసేకరణ అన్యాయమ‌ని వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. చిన్నచిన్న రైతులనూ వదలకుండా వేధింపులకు పాల్ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అనుపమ‌ అనే చిన్న మహిళా రైతు మీద కూడా దౌర్జన్యం చేసి భూమి లాక్కున్నారని ఆరోపించారు.

''సీడ్ యాక్సెస్ రోడ్‌కు అవసరమైతే రైతులతో మాట్లాడాలి, అలా చేయకుండా వీధిరౌడీల్లాగా అధికారులు, పోలీసులు వెళ్లారు. చిన్నచిన్న రైతుల బాధలు ఈ ప్రభుత్వానికి పట్టవా? శని, ఆదివారం కోర్టులు ఉండవని ఈరోజు వచ్చి బలవంతంగా రైతులను తరిమేశారు. రాజధాని రానప్పుడే ఎకరం ఐదు కోట్లు పలికిన భూమి ఇది. అలాంటి రైతులతో మాట్లాడి సరైన న్యాయం చేయాలి. రైతులను మోసం చేసే ప్రభుత్వం ఇది. రైతుల గొంతు నులుముతోంది. ముందుగా భూములు తీసుకున్న వారికి ఏం న్యాయం చేశారు?'' అని దొంతిరెడ్డి వేమారెడ్డి ప్ర‌శ్నించారు. 


 

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)