Breaking News

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసులో సీఐడీ దూకుడు 

Published on Fri, 04/28/2023 - 07:02

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ దూకుడును గురువారం మరింతగా పెంచింది. చందాదారుల సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా మళ్లింపు, అక్రమ డిపాజిట్ల వ్యవహారాల్లో ఏ1 చెరుకూరి రామోజీ రావు, ఏ 2 చెరుకూరి శైలజాకిరణ్‌కు సహాయకారిగా వ్యవహరించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఏడుగురు కీలక అధికారుల విచారణ చేపట్టింది. 

ఈ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఏపీలోని చందాదారుల నిధుల అక్రమ మళ్లింపులో సాధనంలా వ్యవహరించారు. నిధుల మళ్లింపునకు చెక్‌పవర్‌ కలిగిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని వైస్‌ ప్రెసిడెంట్‌లు సీహెచ్‌ సాంబమూర్తి, రాజాజీ, పి.మల్లికార్జున రావు, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వెంకట స్వామి, ఫైనాన్స్‌ జనరల్‌ మేనేజర్‌ టి.హరగోపాల్, జనరల్‌ మేనేజర్లు ఎల్‌.శ్రీనివాసరావు, జె.శ్రీనివాసరావును విచారించి ముఖ్యమైన ఆధారాలను రాబట్టినట్టు సమాచారం. కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం ప్రకారం సంబంధిత బ్రాంచి మేనేజర్‌ (ఫోర్‌మెన్‌)కు చెక్‌ పవర్‌ ఉండాలి.

కానీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో బ్రాంచి మేనేజర్లకు రూ.500 వరకు మాత్రమే చెక్‌ పవర్‌ను పరిమితం చేయడం గమనార్హం. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజ కిరణ్‌తో పాటు మరో 11 మందికి నిబంధనలకు విరుద్ధంగా చెక్‌ పవర్‌ కేటాయించి నిధుల అక్రమ బదిలీకి పాల్పడ్డారు. అందులో ప్రధాన భూమిక పోషించిన ఈ ఏడుగురిని విచారించి కీలక ఆధారాలు రాబట్టడంతో పాటు వారి స్టేట్‌మెంట్‌ సీఐడీ నమోదు చేసుకుంది. 

ఇది కూడా చదవండి: మార్గదర్శి కేసులో ట్విస్ట్‌.. రామోజీకి బిగుస్తున్న ఉచ్చు!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)