Breaking News

వెంకటేశ్వరా.. కాపాడలేదే?

Published on Thu, 03/05/2026 - 08:38

ఆ కుటుంబంలో త్వరలో ఓ శుభకార్యం ఉండడంతో బంధువులు ఎంతో సంతోషించారు. కార్యం దిగ్విజయం కావాలని.. ముందుగా ఇలవేల్పు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఆశీర్వాదం పొందాలనుకున్నారు. కుటుంబంతో కలిసి కారులో తిరుమల కొండకు బయలుదేరారు. ఇంతలోనే విధి వక్రించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరువాసుల తీర్థయాత్ర విషాదమయమైంది.

  • పలమనేరు/ గంగవరం: కర్ణాటక నుంచి తిరుమలకు వెళ్తున్న కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. బెంగళూరులోని రాజాజీనగరకు చెందిన మోహన్‌రావు (71), కుసుమ (61) భార్యాభర్తలు. నాగరాజరావు(68), జయంతి (61) వృద్ధ దంపతులు. నాగరాజరావు కుమార్తె పూజ (32) కారులో వెళ్తూ వెనుక నుంచి లారీని ఢీకొనడంతో దుర్మరణం చెందారు.  
    ఎలా జరిగింది? 

    బుధవారం వేకువ జామున ఇంటి నుంచి కారులో బయలుదేరారు. కారును మోహన్‌రావు నడుపుతుండగా ఆయన పక్కన భార్య కుసుమ కూర్చున్నారు. 

  • వెనుక వైపు నాగరాజరావు, జయంతి, పూజ ఉన్నారు.  

  • ముళబాగిళ్‌ వద్ద ఉదయం 8 గంటలకు టిఫిన్‌ చేసి కదిలారు. 

  • ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద బైపాస్‌లో సరిగ్గా 9.05 నిమిషాల ప్రాంతంలో గంటకు 130 కి.మీ వేగంతో వెళుతున్న కారు ముందు వెళుతున్న ఖాళీ సిమెంట్‌ లారీని ఢీకొని లారీ కిందకు దూసుకెళ్లి చిక్కుకుంది. 

  • దీన్ని గమనించని లారీ డ్రైవర్‌ కొంతదూరం అలాగే వెళ్లిపోయాడు.  

  • పక్కరూట్లో వెళ్లే వాహనాల డ్రైవర్లు కేకలు వేయడంతో లారీని రోడ్డు పక్కన ఆపాడు. 

  • ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న వారందరూ నిమిషాలలో మరణించారు. వీరిలో కుసుమ, జయంతి అక్కాచెల్లెళ్లు.  

తెరుచుకోని ఎయిర్‌ బెలూన్లు 
కారు డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకుని ఉంటాడని భావిస్తున్నారు. కారులోని వారంతా సీటు బెల్టులు ధరించే ఉన్నారు. ప్రమాదం జరిగినా ఎయిర్‌ బెలూన్లు మాత్రం ఓపెన్‌ కాలేదు. కారు ముందు వైపున్న సెన్సార్లకు తగలకుండా కారు లారీ కిందికి వెళ్లడంతో సెన్సార్లు పనిచేయలేదని తెలుస్తోంది. బెలూన్లు తెరుచుకుని ఉంటే ప్రాణనష్టం తగ్గేదని పోలీసులు పేర్కొన్నారు. జేసీబీతో చాలాసేపు ప్రయత్నించి కారును, మృతదేహాలను బయటకు తీశారు.

వెంకటేశ్వరా.. కాపాడలేదే?  
=    బంధువుల రోదనలు 
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చిన కాసేపటికే వారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. పొద్దున  బై బై చెప్పి బయల్దేరిన వారు ఇలా అవుతారని అనుకోలేదు.. నెలకు రెండుసార్లు తిరుమలను దర్శించే తమ కుటుంబానికి ఆ దేవుడు ఈ శిక్ష వేయడం ఏమిటి..? అని కుసుమ, జయంతిల అన్న తీవ్రంగా విలపించారు. కారు పేరు కూడా సెవెన్‌హిల్స్‌ అని పెట్టుకున్నామే.. ఆ వెంకన్నకు మాపై దయలేదా..? అని రోదించారు. మృతుల్లో నాగరాజరావు గతంలో బళ్లారి జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. ఆయన కుమార్తె, మృతురాలు పూజ బెంగళూరులోనే టెక్కీగా పనిచేసేది. నాగరాజరావు కుమారుడు జర్మనీలో ఉంటాడు. బంధువుల రోదనలు  అందరినీ కంటతడిపెట్టించాయి.

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)