Breaking News

చిత్తూరు: ఏనుగుల దాడి.. రైతు మృతి

Published on Thu, 11/13/2025 - 09:43

సాక్షి, చిత్తూరు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో రైతు మృతి చెందాడు. కుప్పం నియోజకవర్గంలో రైతులకు రక్షణ కరువైంది. కుప్పం మండల పరిధిలోని కుర్మానిపల్లిలో ఘటన జరిగింది. మృతుడు రైతు కిట్టప్పగా గుర్తించారు. రాగి పంటకు కాపలా ఉన్న రైతుపై ఏనుగులు దాడి  చేశాయి. ఏనుగులు దాడి చేయడంతో పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులు దాడి నుంచి రైతులు ప్రాణాలు కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కాగా, బంగారుపాళెం మండలంలోని అటవీ సరిహద్దు గ్రామమైన టేకుమందలో సోమవారం రాత్రి పంట పొలాలపై ఏనుగులు దాడిచేశాయి. పంటలను ధ్వంసం చేశాయి. మొగిలి దేవరకొండ సమీపంలోని కౌండిణ్య అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు టేకుమంద గ్రామం మామిడి మానుకుంట మీదుగా రైతుల పొలాలపైకి వచ్చాయి.

గ్రామానికి చెందిన పరదేశి, కౌసల్య, గోవిందయ్య, రేణుకమ్మకు చెందిన సుమారు 4 ఎకరాల వరి మడిని తొక్కేశాయి. అదేవిధంగా అరటి చెట్లను విరిచి నేలపాలు చేశాయి. అప్పులు చేసి పంటలు సాగు చేసుకుంటున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)