Breaking News

చంద్రబాబు హయాంలో చదువులు తిరోగమనం

Published on Fri, 10/17/2025 - 05:59

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో పిల్లల చదువులు తిరోగమనం బాట పట్టాయి. వైఎస్‌ జగన్‌ పాలనా కాలంతో పోలిస్తే బాబు పాలనలోని 2024–25 విద్యా సంవత్సరంలో చదువుకునే పిల్లలు సంఖ్య ఏకంగా 2,87,068 మంది తగ్గింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు 2022–23 విద్యా సంవత్సరం నుంచి 2024–25 విద్యా సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన నివేదికను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 

వైఎస్‌ జగన్‌ హయాంలో 2022–23 విద్యా సంవత్సరంతో పోలిస్తే.. 2023–24 విద్యా సంవత్సరంలో చదువుకునే పిల్లల సంఖ్య పెరిగింది. అందుకు భిన్నంగా 20­24–25 విద్యా సంవత్సరంలో చంద్రబాబు పాలనలో చదువుకునే పిల్లల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. సాధారణంగా ఏటా చదువుకునే పిల్లల సంఖ్య పెరగాలి. అందుకు విరుద్ధంగా 2024–25 విద్యా సంవత్సరంలో చదువుకునే పిల్లల సంఖ్య తగ్గిపోయిందంటే పిల్లల చదువులను చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా నిరక్ష్యం చేస్తోందో స్పష్టమవుతోంది. 

తగ్గిన 2.87 లక్షల విద్యార్థులు
2023–24 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2024–25 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదువుకునే విద్యార్థులు 2,87,068 మంది తగ్గారు. వీరిలో బాలుర సంఖ్య 1,84,096 కాగా.. బాలికల సంఖ్య 1,02,972గా ఉంది. మరోపక్క పిల్లల డ్రాప్‌ అవుట్స్‌ కూడా 2023–24తో పోల్చితే 2024–25లో పెరిగిపోయాయి. సాధారణంగా ఏటా డ్రాప్‌ అవుట్లు తగ్గాలి. అందుకు భిన్నంగా 2024–25 బాబు పాలనలో డ్రాప్‌ అవుట్లు పెరిగారు. 

9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు 2023–24 విద్యా సంవత్సరంలో డ్రాప్‌ అవుట్స్‌ 10.1 శాతం ఉండగా.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2024–25 విద్యా సంవత్సరంలో 11.2 శాతానికి పెరిగింది. అలాగే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 2023–24 విద్యా సంవత్సరంలో డ్రాప్‌ అవుట్లు 1.1 శాతం ఉండగా.. 2024–25 విద్యా సంవత్సరంలో 3.7 శాతానికి పెరిగింది. 2023–24 విద్యా సంవత్సరంలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు డ్రాప్‌ అవుట్స్‌ 1.2 శాతం ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో 2.2 శాతానికి పెరిగింది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)