Breaking News

టీడీపీ నాయకుడి దురాగతం.. ఆస్తి కోసం అక్క, తల్లిపై దాడి

Published on Mon, 04/28/2025 - 09:30

సాక్షి, చిలకలూరిపేట: ఆస్తి కోసం సొంత అక్క, తల్లిపైనే టీడీపీ యువనాయకుడు కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం జరిగినదిగా తెలుస్తున్న ఈ ఘటన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  చిలకలూరిపేట పట్టణ పోలీసులను ఆశ్రయించినా నిందితుడు స్థానిక ఎమ్మెల్యేకు అనుంగ అనుచరుడు కావడంతో పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.   

ఈ ఘటనపై బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని పండరీపురానికి చెందిన టీడీపీ యువనాయకుడు చుండూరి ఉదయ్‌ వడ్డీ వ్యాపారం చేస్తాడు. రూ.3కోట్ల విలువ చేసే ఆస్తి వ్యవహారానికి సంబంధించి తల్లి, అక్క నాగలక్షి్మతో ఉదయ్‌కు వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో అతని తల్లి నాగలక్ష్మికి డబ్బు చెల్లించాలని అడిగారు. దీనికి ఉదయ్‌ అంగీకరించకపోవడంతోపాటు తల్లి, అక్కను కిందపడేసి కాళ్లతో కర్రలతో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాధితురాలు నాగలక్ష్మి ఉదయ్‌ దాడికి పాల్పడిన దృశ్యాలతో కూడిన వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టారు. 

పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదని,  సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ తమ ప్రాణాలు కాపాడాలని సోషల్‌మీడియా వేదికగా వేడుకున్నారు. ఈ విషయంపై అర్బన్‌ సీఐ పి.రమేష్‌ను ఫోన్లో వివరణ కోరగా  బాధితులు పోలీసు స్టేషన్‌కు వచి్చన మాట వాస్తవమేనని అయితే, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వ్యవహారం మాట్లాడి రాజీ చేసుకుంటామని వెళ్లిపోయారని వివరించారు. బాధితులు కేసు నమోదు చేయమంటే నమోదు చేస్తామని వివరించారు.  

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)