Breaking News

బీసీల అభ్యున్నతి కోసం సీఎం జగన్‌ కృషి

Published on Mon, 02/13/2023 - 03:42

గుంటూరు రూరల్‌: బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడదల రజిని చెప్పారు. నగర శివారు అమరావతిరోడ్డులో ఆదివారం బీపీ మండల్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో మంత్రులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న నేత సీఎం జగన్‌ అని కొనియాడారు.

గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని, కానీ నేడు జగనన్న ప్రభుత్వంలో బీసీల అభివృద్ధి జరిగిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు మంత్రి పదవులు, చట్ట సభల్లో ప్రాధాన్యం దక్కిందన్నారు. బీపీ మండల్‌ బీసీల అభివృద్ధికి దేశ వ్యాప్తంగా తిరిగి జనాభా ప్రాతిపదికన ఎన్నో సంస్కరణలు చేశారని, వాటిని అమలు చేయాలని కోరారు.

బీసీల అభివృద్ధికి జనగణన చేపట్టాలంటూ బీసీలంతా ఐకమత్యంగా ఒక వేదికపైకి రావడాన్ని అభినందించారు. జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్, కల్పలతారెడ్డి, ఎంపీ బీద మస్తాన్‌రావు, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు, నగర డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజిల, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టీనా, బీపీ మండల్‌ మనుమడు ప్రొఫెసర్‌ సూరజ్‌మండల్, ద్రవిడ కజగం ప్రెసిడెంట్‌ వీరమణి, తమిళనాడు ఎంపీ తిరుమావళాన్, బీసీ సంక్షేమ సంఘం నేత డాక్టర్‌ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)