Breaking News

మూడు ముళ్లకెందుకులే తొందర!

Published on Wed, 07/16/2025 - 05:47

సాక్షి, అమరావతి: పెళ్లి విషయంలో దేశంలోని యువత ధోరణి మారుతోంది. యుక్త వయస్సు రాగానే పెళ్లి కోసం ఆరాటపడే యువకులు ఇప్పుడు కనిపించడంలేదు. ఒకప్పుడు 23 నుంచి 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం సహజంగా ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకునేందుకు యువత ఆసక్తి చూపడంలేదు. ముఖ్యంగా యువకుల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ మార్పుకు మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. 

ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్వావలంబన, వ్యక్తిగత అభిరుచి మేరకు పెళ్లికి సిద్ధమవుతున్నారు. ‘బెటర్‌ హాఫ్‌ ఏఐ’ అనే సంస్థ 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువతపై చేసిన సర్వేలో సుమారు 68శాతం మంది యువకులు ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోకూడదనే అభిప్రాయంతో ఉన్నట్లు తేలింది. ఆ కారణంతోనే పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారని స్పష్టమైంది.

అమ్మాయిలు దొరకడం లేదు
చాలా ప్రాంతాల్లో యువకులకు జోడీగా అమ్మాయిలు దొరకని పరిస్థితి నెలకొంది. చదువుకున్న అమ్మాయిల్లో 65 శాతం మంది తమకు సమానంగా ఉన్న అబ్బాయిలను మాత్రమే పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తున్నారు. చదువు, ఉద్యోగంలో కొంచెం వెనుకబడ్డ యువకులకు పెళ్లి సంబంధాలు రావడం లేదని విజయవాడకు చెందిన ఒక మ్యారేజీ బ్యూరో ప్రతినిధి భవానీ శంకర్‌ చెప్పారు. ప్రధానంగా కొన్ని సామాజికవర్గాలు, కులవృత్తిపై ఆధారపడివారిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది.

ఐటీ రంగంలో ఉన్నవాళ్లు అదేరంగంలో ఉన్న వారి కోసమే చూస్తున్నారు. అందులోనూ తమ ఉద్యోగ స్థాయికి తగ్గట్టు ఉన్నారో... లేదో.. చూస్తుండడంతో సంబంధాలు వెంటనే కుదరడంలేదు. ఇలా వివిధ అభిరుచులు, కారణాల వల్ల అన్నిచోట్లా తల్లిదండ్రులు సంబంధాల కోసం పరితపించే పరిస్థితి ఏర్పడింది. 

గ్రామీణ ప్రాంతాల్లో అయితే పని చేయని వారికి సంబంధాలే రావడంలేదని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మ్యారేజీ బ్యూరో నిర్వాహకుడు రామారావు చెప్పారు. తమకు సరిపోయే జోడీ దొరక్కపోవడంతో పెళ్లిని చాలామంది వాయిదా వేసుకుంటున్నారు. ప్రధాన నగరాల్లో అయితే పెళ్లి కంటే సహజీవనం పట్ల ఆకర్షణ కూడా పెరుగుతోంది. 

తల్లిదండ్రులపై భారం లేకుండా...
» ‘బెటర్‌ హాఫ్‌ ఏఐ’ సర్వే ప్రకారం 70 శాతం మంది యువకులు పెళ్లి ఖర్చును తామే భరించాలనుకుంటున్నారు. తల్లిదండ్రులపై భారం మోపకుండా జీవితం ప్రారంభించాలని ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. 
»  జీవితంలో ఇంకా స్థిరపడలేదు... స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే భావన అబ్బాయిల్లో బలంగా ఉంటోంది.
»గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకా­శాలు తక్కువగా ఉండటంతో యువ­కులు కాస్త త్వరగా పెళ్లికి ఒప్పుకుంటున్నారు. అయితే, వారికి సరైన జోడీ దొరకడం కష్టంగా మారుతోంది. ూ    చదువు, కెరీర్‌లో ఎదగాలన్న లక్ష్యం కూడా పెళ్లిని రెండవ ప్రాధాన్యతగా మార్చుతోంది.
»  పట్టణాల్లో అందుకు భిన్నమైన పరి­స్థితి కనిపిస్తోంది. ఆర్థిక స్వావ­లంబ­న, కెరీర్‌పై ఫోకస్, సరైన భాగ­స్వా­మిని ఎంచుకోవాలన్న కా­రణా­ల వల్ల పెళ్లి ఆలస్యమవుతోంది.

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)