Breaking News

డీఎస్సీ వెబ్‌సైట్‌లో మార్పులు

Published on Sun, 04/27/2025 - 06:10

సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల­ను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు టెన్త్, ఇంటర్‌ మార్కు­ల పర్సంటేజీ సీలింగ్‌ తొలగించింది. డీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శుక్ర­వారం ‘మెగా అగచాట్ల డీఎస్సీ’ పేరుతో సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై విద్యాశాఖ స్పందించింది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేప­ట్టింది. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీలో జనరల్‌ అభ్యర్థులు 50 శాతం, రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు 45% మార్కులు తప్పనిసరి చేసింది.  

ఎస్జీటీ పోస్టులకు ఇంటర్‌లో 50, 45 శాతం మార్కులు నిర్ణయించింది. అయితే, ఈ మార్కుల శాతం కనీస అర్హతలైన ఎస్‌ఏలకు పదో తరగతి, ఇంటర్‌లోను అనుసరించడంతో అంతకంటే తక్కువ మార్కులు వచి్చన అభ్యర్థుల దరఖాస్తు ప్ర­క్రియ ముందుకు సాగడం లేదు. అలా­గే, బీఎస్సీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తిచేసిన వారికి స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథమెటిక్స్‌కు అర్హత కల్పించా­రు. 

అయితే, వెబ్‌సైట్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ఆప్షన్‌ లేకపోవడంతో వారం రోజులుగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నా­రు. దీంతోపాటు ఓపెన్‌ స్కూలింగ్‌లో పది, ఇంటర్‌ పూర్తిచేసిన వారికీ ఆప్షన్‌ లేకపోవడంతో అభ్యర్థుల్లో కంగారు మొదలైంది. ఈ సమస్యలపై కథనం రావ­డంతో అధికారులు పరిష్కరించారు. వీటితోపా­టు అరబిక్‌ లాంగ్వేజ్‌ ఆప్షన్‌ను ఇంటర్, డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా ఆన్‌లైన్‌లో మార్పులు చేశారు.  

డిగ్రీలో 35 మార్కులకూ అప్‌లోడ్‌పై ఆశ్చర్యం 
ఎస్జీటీ రాసేవారికి ఇంటర్లో జనరల్‌ అభ్యర్థులు 50 శాతం, రిజర్వుడు అభ్యర్థులకు 45 శాతం మార్కు­లు తప్పనిసరి చేసింది. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీలో 50, 45 శాతం, పీజీటీలకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55, 50 శాతంగా మార్కుల సీలింగ్‌ పెట్టారు. దీంతో డిగ్రీ సీలింగ్‌ మార్కులు కంటే తక్కువ ఉంటే దరఖాస్తు ప్రక్రియలో ఎర్రర్‌ చూపించేది. కానీ, శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఆయా పోస్టులకు 35 శాతం మార్కులు ఉన్నా దరఖాస్తు ప్రక్రియ కొనసాగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.   

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)