Breaking News

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు

Published on Sun, 02/08/2026 - 05:37

సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌లో ప్రభుత్వం స్వల్ప మార్పు చేసింది. మార్చిలో నిర్వహించనున్న పబ్లిక్‌ పరీక్షల్లోని ఇంగ్లిష్‌ పరీక్ష తేదీని మార్చింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌లో ప్రకారం మార్చి 20న (శుక్రవారం) ఇంగ్లిష్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఆ రోజు రంజాన్‌ పండుగ సెలవు కావడంతో ఇంగ్లిష్‌ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ మరుసటి రోజు 21వ తేదీన ఇంగ్లిష్‌ పరీక్ష నిర్వహించనుంది.

ఈ మేరకు పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులరెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.  మిగిలిన అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా జరుగుతాయని తెలిపారు. అయితే, గత డిసెంబర్‌ 4న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మార్చి 20న (ఈద్‌–ఉల్‌–ఫితర్‌) రంజాన్‌ పండుగ సెలవు ప్రకటించారు. అయినా పాఠశాల విద్యాశాఖ ఆలస్యంగా తేరుకుని ఇప్పుడు పరీక్ష తేదీని మార్చడం గమనార్హం.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)