Breaking News

ఇసుకపై మాయోపాయం

Published on Wed, 10/23/2024 - 05:40

సాక్షి, అమరావతి: ఇసుక ఉచితం అంటూనే డబ్బు వసూలు చేస్తూ జనాన్ని మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం తాజాగా ప్రైవేటు ఏజెన్సీలకు ఇసుక తవ్వకాలు అప్పగించే విషయంలోనూ నాటకాలకు తెరలేపింది. ప్రైవేటు వ్యక్తులకు ఇసుక తవ్వకాలను అప్పగించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సోమవా­రం జరిగిన గనుల శాఖ సమీక్షలో సూచించారు. కానీ ఇప్పటికే 80కిపైగా ఇసుక రీచ్‌లను ప్రైవేటు ఏజెన్సీల ముసుగులో తమ పార్టీ మద్దతుదారులకు కట్టబెట్టేశారు. 

రాష్ట్రంలోని 108 ఇసుక రీచ్‌లను దసరా పండుగ సమయంలో ప్రైవేటు వారికి అప్పగించేందుకు గుట్టుచప్పుడు కాకుండా జిల్లా­లవారీగా ఇసుక కమిటీ ద్వారా షార్ట్‌ టెండర్లు పిలిచారు. టెండర్లు దాఖలు చేయడానికి కేవలం రెండు రోజులే సమయం ఇచ్చి, తమ పార్టీకి చెందిన వారు, తమకు అనుకూలమైన వారికే ఇసుక కాంట్రాక్టులు అప్పగించేలా జిల్లా కలెక్టర్ల ద్వారా టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. 

ఆఖరి నిమిషంలో తెలుసుకుని టెండర్లు దాఖలు చేయడానికి వచ్చిన వారిని టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులు బెదిరించి వెనక్కు పంపారు. దాదాపు 80 రీచ్‌లను ఎమ్మెల్యేలకు చెప్పిన వారి­కి అప్పగించేయగా, మిగిలిన రీచ్‌లకు సైతం అను­కూలమైన వారిని ఖరారు చేశారు. అప్పగించిన రీచ్‌ల్లో ఈ నెల 16వ తేదీ నుంచే ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 108 రీచ్‌ల్లో ఈ నెలాఖరు నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

ఉల్లంఘనలు కప్పిపుచ్చేందుకే.. 
ప్రైవేటు వారికి అప్పగించే టెండర్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పడం ఉల్లంఘనలను కప్పిపుచ్చేందుకేనని స్పష్టమవుతోంది. మరో వైపు ఇసుక వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఎవరూ జోక్యం చేసుకోవద్దని కూడా సూక్తులు చెబుతున్నారు. ఇప్పటికే కాంట్రాక్టులు అయిన వారికి కట్టబెట్టేసి, వాటిల్లో తవ్వకాలు కూడా మొదలు పెట్టి.. బయటకు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. 

ఇప్పుడు ఇదే విషయంపై రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. ఇసుక రీచ్‌లను ప్రైవేటు వారికి అప్పగించే విషయం ఇంకా చర్చల దశలో ఉందని సీఎం చెబుతుండటం చూస్తుంటే, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేందుకేనని తెలుస్తోంది. వర్షాకాలం సీజన్‌లో ఇసుక రీచ్‌లలో తవ్వకాలు చేపట్టకూడదు. సాధారణంగా నవంబర్‌ నెలాఖరు వరకు రీచ్‌లు ప్రారంభించకూడదు. కానీ అక్టోబర్‌ 7వ తేదీనే పలు జిల్లాల్లో టెండర్లు పిలిచి కాంట్రాక్టులను ఖరారు చేశారు. 

16వ తేదీ నుంచి తవ్వకాలు కూడా ప్రారంభించారు. కానీ ఇదంతా గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలకు విరుద్ధం కావడంతో, పైకి మాత్రం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే విషయాన్ని ఇంకా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకపక్క రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు సాగించి అడ్డగోలుగా అమ్ముకుంటూ.. పైకి మాత్రం అదేమీ లేదనేలా సీఎం స్థాయి వ్యక్తి నమ్మబలుకుతుండడం విస్తుగొలుపుతోంది. రీచ్‌లు ఇంకా ప్రారంభం కాలేదని చిత్రీకరించే క్రమంలోనే సీఎం ఇలా మాట్లాడుతున్నారని తేటతెల్లమవుతోంది.    

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)