Breaking News

దాతల భాగస్వామ్యం కావాలి

Published on Fri, 08/16/2024 - 05:57

సాక్షి, మచిలీపట్నం/సాక్షి, అమరావతి: పేదోడి ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు తెచ్చామని ము­ఖ్య­మంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం మున్సిపల్‌ పార్కులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రారంభించారు. ప్రజలతో కలిసి క్యాంటీన్‌లోనే భో­జనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో తాము ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఆటో కార్మికులు, హమాలీలు, పారిశుద్ధ్య కార్మికు­లు, చిరు వ్యాపారులు ఎంతో మంది సద్వినియో­గం చేసుకున్నారని, వారి భోజన ఖర్చు చాలా మిగిలిందని అన్నారు. 

ఈ క్యాంటీన్ల నిర్వహణ కోసం తన సతీమణి భువనేశ్వరి రూ. కోటి ఇచ్చారని, పలువురు దాతలు కూడా విరాళాలు ఇచ్చారని, మిగ­తా వారు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. పెళ్లిళ్ల ఖర్చు తగ్గించుకొని అన్న క్యాంటీన్లకు విరాళాలివ్వాలని సూచించారు. దీని కోసం ప్రత్యేక బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచామని, నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా ఈ ఖాతాకు విరాళాలివ్వొచ్చని తెలిపారు. జ­న­వరిలో జన్మభూమి 2.ను ప్రారంభించి, గ్రామాల అభివృద్ధిలో మళ్లీ ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. రాష్ట్రంలో జనాభా తగ్గుతోందని, పిల్లల పుట్టుక తగ్గడంతో యువత శాతం తగ్గిందని చెప్పా­రు. 

సంపద సృష్టించే యువకులు తగ్గడం ప్రమాదకరమని అన్నారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా.. ఎక్కువ మంది పిల్లలున్న వారికే సంపద ఉంటుందని చెప్పారు. 2004 కంటే ముందు హైదరాబాదుతో పాటు అనేక ప్రాంతాలను అభివృద్ధి చేశానని, అయితే తనకంటే మెరుగ్గా పాలిస్తారని వేరే పారీ్టకి ఓట్లు వేయడంతో రాష్ట్ర విభజనకు దారితీసే పరిస్థితి తెచ్చారని అన్నారు. 

2019లోనూ తననే గెలిపించి ఉంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లే వాడినని చెప్పారు. మరో 23 ఏళ్లకు 100వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకుంటామని, అప్పటివరకు తమ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉంచుతామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మంచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్‌రాజా, జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

నేడు 99 చోట్ల అన్న క్యాంటీన్ల ప్రారంభం
వచ్చే నెలాఖరుకి రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు మున్సిపల్‌ శాఖ తెలిపింది.  శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 99 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని మున్సిపల్‌ మంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.   

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)