Breaking News

మళ్లీ రూ.5వేల కోట్ల అప్పు

Published on Sat, 12/28/2024 - 05:27

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ అప్పు చేస్తోంది. ఈసారి ఏకంగా రూ.5,000 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. ఈ నెల 31వ తేదీన ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. 

రాష్ట్ర ప్రభుత్వం 12 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 13 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 14 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.2,000 కోట్లు అప్పు చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం నవంబర్‌ వరకు రూ.65,590 కోట్లు అప్పు చేసినట్లు కాగ్‌ గణాంకాలు వెల్లడించాయి. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రూ.4,237 కోట్లు అప్పు చేసింది. 

ఈ నెల 31వ తేదీన మరో రూ.5,000 కోట్లు అప్పు చేయనుంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే బడ్జెట్‌ పరిధిలో చేసిన అప్పులే రూ.74,827 కోట్లకు చేరనున్నాయి. ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేసింది. దీనికి తోడు చంద్రబాబుతోపాటు కూటమి నేతలు కూడా అప్పులు ఎక్కువగా చేశారంటూ లేని అప్పులను కూడా కలిపి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారు. 

అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌ పరిధిలోను, బడ్జెట్‌కు బయట పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నప్పటికీ ఎల్లో మీడియా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు అప్పులు చేస్తే ఒప్పు... అదే గత సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అప్పులు చేస్తే తప్పు... అన్నట్లుగా చిత్రీకరించడమే ఎల్లో మీడియా నైజంగా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)