Breaking News

నిబంధనలు ఓడి.. అప్పుల దాడి

Published on Thu, 06/26/2025 - 05:30

సాక్షి, అమరావతి :  రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ, కోర్టు విచారణను సైతం లెక్క చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఏపీఎండీసీ (ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ) ద్వారా రెండవ విడత ఎన్‌సీడీ (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌) బాండ్లు జారీ చేసి రూ.5,526 కోట్ల అప్పు చేసింది. మొదటి విడతగా మే 8వ తేదీన రూ.3,489 కోట్ల బాండ్లు జారీ చేసింది. అన్ని నిబంధనలను కాలరాసి బాండ్ల జారీతో మొత్తంగా రూ.9,015 కోట్ల అప్పు తెచ్చుకోగలిగింది. దీంతో కలిపి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే చేసిన అప్పు రూ.1,66,827 కోట్లు. 

సంపద సృష్టిస్తానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అప్పుల సృష్టిలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఏపీఎండీసీ ద్వారా జారీ చేసిన ఎన్‌సీడీ బాండ్ల విషయంలో చంద్రబాబు ఆర్థిక సూత్రాలన్నింటినీ తుంగలో తొక్కారు. అప్పు తెచ్చుకోవడమే లక్ష్యమైనట్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తప్పుడు సంప్రదాయానికి నాంది పలికారు. అప్పులు చేయడం కోసం చంద్రబాబు చూపిన చెడు మార్గాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పాటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పెను ప్రమాదంలో పడుతుందని ఆర్థిక నిపుణులు వాపోతున్నారు.   

ఆర్థిక నియమాలకు పాతర
అప్పు కోసం ఏ స్థాయికైనా దిగజారతాననే రీతిలో చంద్రబాబు ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ బాండ్లు జారీ చేయించారు. రూ.9 వేల కోట్లు సమీకరించేందుకు ఆర్థిక నియమాలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చేయని విధంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టారు. రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌పై ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారికి హక్కులు కల్పించారు. ప్రైవేటు వ్యక్తులకు ఖజానాను అప్పగించడాన్ని బట్టి చంద్రబాబు ఏ స్థాయి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293 (1) ప్రకారం ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వ ఖజానాను తాకట్టు పెట్టకూడదు. అయినా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ చంద్రబాబు ఈ అప్పు తీసుకొచ్చారు. ఇందుకోసం ఏపీఎండీసీకి చెందిన రూ.1.91 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ వనరులను తాకట్టు పెట్టారు. తద్వారా ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను పెట్టుబడిదారులకు రాసిచ్చారు.  

ప్రత్యేక ప్రయోజనాలు కల్పించినా ఎక్కువ వడ్డీ రేటు 
లక్షల కోట్ల రూపాయల విలువైన గనుల్ని తాకట్టు పెట్టిందేకాక, రాష్ట్ర ఖజానాపై నేరుగా హక్కులు ఇచ్చి కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా బాండ్లు కొనుగోలు చేసిన వారికి 9.30 శాతం వడ్డీ రేటు ఇచ్చారు. ఇది మరింత అన్యాయంగా ఉందని ఆర్థిక నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్‌ (ఎస్‌డీఎల్‌)ను 6.71 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటుండగా, పలు ప్రత్యేక వెసులుబాట్లు, హక్కులు ఇచ్చి కూడా 9.30 శాతం వడ్డీ ఇవ్వడం వెనుక ఏదో జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

చంద్రబాబు రాష్ట్రం గురించి ఏమాత్రం ఆలోచించకుండా, కేవలం బాండ్లు కొనుగోలు చేసే వారికి అన్ని రకాలుగా ప్రయోజనాలు కల్పించడమే ప్రధానమన్నట్లు వ్యవహరించారు. ప్రభుత్వానికి తీవ్ర నష్టం వచ్చినా పర్వాలేదని, ప్రభుత్వ ఖజానా తన సొంత బ్యాంకు అన్నట్లుగా దానిపై బాండ్లు కొనుగోలుదారులకు హక్కులిచ్చేశారు.    దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా బాండ్ల జారీ ప్రక్రియను పూర్తి చేసి రూ.9 వేల కోట్ల అప్పను సమీకరించుకున్నారు. కోర్టులు కూడా తనను ఏమీ చేయలేవనే, తాను కోర్టులకు అతీతుడనే రీతిలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తోంది.  

ఏడాదిలో రూ.1,66,827 కోట్ల అప్పుతో కొత్త రికార్డు  
ఏడాదిలోనే రూ.1,66,827 కోట్ల అప్పు చేసి చంద్రబాబు కొత్త రికార్డు సృష్టించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే నానా రాద్ధాంతం చేసిన ఇదే బాబు.. ఇప్పుడు అప్పుల చరిత్రలో కొత్త శకాన్ని లిఖిస్తున్నారు. ప్రతి వారం అప్పుల కోసం ఆర్‌బీఐ ఎదుట మోకరిల్లుతున్నారు. అదికాకుండా ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ (బడ్జెట్‌ వెలుపల రుణాలు) ద్వారా ఏపీఎండీసీ, మార్క్‌ఫెడ్, ఏపీపీఎఫ్‌సీ వంటి సంస్థలను దివాలా తీయిస్తున్నారు. 

ఇతర విదేశీ ఆరి్థక సంస్థల నుంచి అప్పులు తెస్తున్నారు. ఎక్కడ వీలు కుదిరితే అక్కడ అప్పు చేస్తూ రాజ్యాంగాన్ని, కోర్టుల్ని కూడా ఖాతరు చేయకుండా ప్రజాస్వామిక విలువలకు పాతరేస్తున్నారు. పోనీ అప్పులేమైనా ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. బాబు అప్పుల దాహం, రాజ్యాంగ ధిక్కరణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)