Breaking News

‘సెకీ’కి సెల్యూట్‌!

Published on Fri, 02/27/2026 - 02:39

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి 300 మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు (విద్యుత్‌ షెడ్యూలింగ్, ఆఫ్‌ టేక్‌ ప్రారంభం) ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇది చాలా ఉపయోగకర ఒప్పందమని ఏపీ పవర్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఏపీపీసీసీ) చేసిన సూచనపై సానుకూలంగా స్పందించింది. తద్వారా ఇన్నాళ్లూ చంద్రబాబు అండ్‌ కో ‘సెకీ’ ఒప్పందంపై చేసిందంతా విష ప్రచారమేనని తేటతెల్లమైంది. 

2021 డిసెంబర్‌ 1న కుదిరిన పవర్‌ సేల్‌ అగ్రిమెంట్‌ (పీఎస్‌ఏ) ప్రకారం ఈ విద్యుత్‌ సరఫరా జరుగుతుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రానికి విద్యుత్‌ సరఫరా చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ (కనెక్టివిటీ ఆపరేషనలైజేషన్‌) పూర్తయిన అనంతరం విద్యుత్‌ తీసుకునే ప్రక్రియ (షెడ్యూలింగ్‌) ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 

ఈ ప్రక్రియలో ఏపీపీసీసీతోపాటు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు, ఏపీఆర్‌ఏపీఎల్, ఏపీఎస్‌ఎల్‌డీసీ సంస్థలు ఎస్‌ఈసీఐ, సీటీయూఐఎల్, ఆర్‌ఎల్‌డీసీలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పీఎస్‌ఏ నిబంధనలకు అనుగుణంగా వాణిజ్య లావాదేవీలు (కమర్షియల్‌ సెటిల్‌మెంట్‌) నిర్వహించాలని సూచించింది. 

దీర్ఘకాలిక విద్యుత్‌ వినియోగం కోసం జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ ఫర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ(జిఎన్‌ఏ–ఆర్‌ఈ) వెసులుబాటును పొందాలని కూడా స్పష్టం చేసింది. అలాగే, ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం విద్యుత్‌ స్వీకరణ జరుగుతుందని, ఏపీ సరిహద్దు వరకు ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌విుషన్‌ సిస్టమ్‌ (ఐఎస్‌టీఎస్‌–అంతర్రాష్ట్ర ప్రసారం) చార్జీలు, నష్టాలపై రాష్ట్రానికి ఎలాంటి బాధ్యతా ఉండదని తెలిపింది.  

ఐఎస్‌టీఎస్‌ చార్జీల మినహాయింపుతో యూనిట్‌ రూ.2.49కి సౌర విద్యుత్‌ సరఫరా చేస్తామంటూ గతప్రభుత్వానికి సెకీ రాసిన లేఖ 

అదీ విజన్‌ అంటే.. 
» రైతులు పడుతున్న అవస్థలను చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వారికి ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలని సంకల్పించారు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్లపాటు రోజుకు 9 గంటల చొప్పున పగటిపూటే ఇవ్వాలని దృఢంగా భావించారు. దానికి తగ్గట్టుగానే ముందుచూపుతో ఆలోచించి సౌర విద్యుత్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వ్యవసాయానికి సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టారు. 

»  అదే సమయంలో అంతర్రాష్ట్ర విద్యుత్‌ సరఫరా చార్జీలు (ఐఎస్‌టీఎస్‌) మినహాయించి, యూనిట్‌ రూ.2.49 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్‌ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే యూనిట్‌ రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 

»  ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్‌ 11న ఏపీఈఆర్‌సీ ఆమోదించింది. సెకీ నుంచి విద్యుత్‌ తీసుకోవడం వల్ల పాతికేళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్‌విుషన్‌ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుందని ఒప్పందంలో స్పష్టంగా ఉంది. అయినా ఈ ఒప్పందం వల్ల ఐఎస్‌టీఎస్‌ చార్జీల మినహాయింపు ఉండదని అప్పట్లో చంద్రబాబు అదే పనిగా దుష్ప్రచారం చేశారు. ఎల్లో మీడియా ఆయనకు వంత పాడుతూ పుంఖానుపుంఖాలుగా తప్పుడు కథనాలు ప్రచురించింది. 

»  కానీ అవన్నీ అవాస్తవాలని ఒప్పుకుంటూ.. ఇప్పుడు అదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు, నష్టాలు సెకీ విద్యుత్‌కు వర్తించవని అధికారికంగా స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లూ వారు చేసిందంతా అసత్య ప్రచారమని వారే అంగీకరించినట్లయింది.  

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)