Breaking News

వరి వల్ల ఉపయోగం లేదు.. ఆదాయం లేదు

Published on Thu, 12/04/2025 - 04:56

సాక్షి, రాజమహేంద్రవరం/నల్లజర్ల: వరి సాగు వల్ల ఎలాంటి ఉపయోగం, ఆదాయం లేవని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. వరిస్థానంలో ఉద్యా­న పంటలు సాగుచేయాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బుధవారం నిర్వహించిన రైతన్నా మీ కోసం.. కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆ­యన మాట్లాడుతూ పామా­యిల్‌ సాగులో టెక్నా­లజీ ఉపయోగించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు. 

గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపామని, వంశధారకు కలుపుతామని, పెన్నా­నది వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. భూగర్భ జలాలు పెంచుకోగలిగితే కరవు ఉండదని చెప్పారు. పోలవరం రైట్‌ కెనా­ల్‌ నుంచి నీరు ఇస్తే నల్లజర్ల ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. కరవు ఎ­క్కువగా ఉండే రా­యలసీమ నంద్యాల జిల్లా­లో భూగర్భ జలా­లు నా­లు­గు మీటర్లకు పెరిగాయన్నా­రు. తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలాలు తగ్గాయని చెప్పారు.    

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం 
సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మాదిరిగానే దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయా­ణ అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్ర­పంచ దివ్యాంగుల దినోత్సవ సభలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో అమరావతితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లోను ‘దివ్యాంగ్‌ భవన్‌’లు ఏర్పాటు చేస్తామన్నారు. 

విశాఖపట్నంలో 23 ఎకరాల్లో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసిబిలిటీ స్పోర్ట్స్‌ స్టేడియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఇటీవల అంధ మహిళల ప్రపంచ కప్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కరుణ కుమారికి రూ.15 లక్షలు, దీపికకు రూ.10 లక్షలు చొప్పున ప్రభుత్వం తరపున అందిస్తామని, వారికి ఇళ్లు నిరి్మస్తామని చెప్పారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)