Breaking News

బాబు సర్కారు మరో బాంబు.. రూ.13,100 కోట్ల బాదుడు

Published on Tue, 01/13/2026 - 04:29

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, సహజ వనరుల దోపిడీ, పేకాట క్లబ్బులు, విద్యుత్తు చార్జీల బాదుడుతో­పాటు సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలకు తూట్లు పొడిచి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన చంద్రబాబు సర్కారు తాజాగా.. ఆదాయం కోసం ఆంధ్రప్రదేశ్‌ లాటరీని తీసుకురావాలని ప్రతిపాదించింది. వివిధ సెస్‌లు, పన్నుల ద్వారా రాష్ట్ర ప్రజలపై మరో రూ.13,100 కోట్ల మేర అదనపు భారం మోపాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశం సాక్షిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

లాటరీ.. ఆన్‌లైన్‌ గేమింగ్‌ పన్నులు..
ఆంధ్రప్రదేశ్‌ లాటరీని తీసుకురావడం ద్వారా రూ.3,000 కోట్లు ఆర్జించాలని చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ పన్ను ద్వారా రూ.1,400 కోట్లు ఆర్జించాలని నిర్దేశించుకుంది. ఎస్‌జీఎస్‌లపై ఒక శాతం సెస్‌ విధించడం ద్వారా రూ.4,700 కోట్లను ఆర్జించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన 55వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా రూ.2,300 కోట్లు ఆర్జించాలని ప్రతిపాదించారు. అలాగే రెండో, మూడో స్థాయి అమ్మకాలపై వ్యాట్‌ విధించడం ద్వారా రూ.1,300 కోట్లు ఆర్జించాలని ప్రతిపాదన చేశారు. 

వృత్తి పన్ను పెంపు ద్వారా రూ.400 కోట్లు, విజయవాడ, విశాఖపట్టణం మున్సిపల్‌ పరిధిలో వృత్తి పన్ను వసూళ్లను బదిలీ ద్వారా రూ.110 కోట్లు ఆర్జించాలని ప్రతిపాదించారు.వసూళ్ల పెంపు కోసం పన్ను ఆధార విస్తరణ, బకాయిల వసూళ్లు, ఐటీ ఆధారిత పర్యవేక్షణ, కొత్త ఆదాయ వనరుల అన్వేషణపై దృష్టి పెట్టడం ద్వారా 2025–26లో రాష్ట్రం స్వంత ఆదాయ వృద్ధి లక్ష్యాలను అధిగమించనున్నారు. ఈమేరకు ఆదాయ విభాగాల లక్ష్యాలు, సాధనపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్‌ కుమార్‌    ఈ సమావేశంలో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. బడ్జెట్‌ లక్ష్యాలకు తగినట్లు ఆదాయం రావడం లేదన్నారు.

AP Revenue : బాబు ఖజానా నింపే ప్లాన్..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)